Ads
బీజేపీ తొలి జాబితాలో హైదరాబాద్ లోక్ సభ స్థానానికి కొంపెల్ల మాధవి లత పేరు ప్రకటించింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పై మాధవి లతని బీజేపీ రంగంలోకి దింపింది. నిజానికి మజ్లిస్ 2004 నుంచి హైదరాబాదు లోక్ సభ నియోజకవర్గం నుంచి అతనే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అలాంటి అసదుద్దీన్ కు పోటీగా బీజేపీ ప్రభుత్వం మాధవి లతను బరిలోకి దింపిందంటే వారికి ఆమెపై ఉన్న నమ్మకం ఏమిటి.. అసలు ఎవరీ మాధవి లత, ఒకసారి చూద్దాం.
Video Advertisement
కొంపెల్ల మాధవి లత ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేక పోరాటంతో వెలుగులోకి వచ్చారు. సాంస్కృతిక కార్యకర్త అయిన డాక్టర్ మాధవి హైదరాబాదులోని విరించి హాస్పిటల్ చైర్మన్ గా ఉన్నారు. మాధవి లత ఒక ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్.
ఆమెకి ముగ్గురు పిల్లలు. మాధవి లత ఎన్ సి సి క్యాడెట్ గా చేశారు. ఆమె పొలిటికల్ సైన్స్ చదివారు. మాధవి లత భర్త విశ్వనాధ్ విరించి హాస్పిటల్ వ్యవస్థాపకుడు. మాధవి లత లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
49 ఏళ్ల మాధవి లత హైదరాబాదులో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న తొలి మహిళా అభ్యర్థి.ఇక అసదుద్దీన్ ఓవైసీ విషయానికి వస్తే అతను 2004 నుంచి హైదరాబాదు లోక్ సభ నియోజకవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1984లో ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ గెలిచినప్పటి నుంచి హైదరాబాదు లోక్ సభ నియోజకవర్గం మజ్లిస్ కు కంచుకోట.
2004 నుంచి ఈ స్థానం నుంచి అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తున్నారు. మాధవి లత గత కొంతకాలంగా ఓల్డ్ సిటీ ప్రాంతాలని సందర్శిస్తున్నారు. అక్కడే పరిస్థితులపై ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తున్నారు. అందుకే ఆమెను అతనికి పోటీగా రంగంలోకి దింపింది బీజేపీ అధిష్టానం. 195 మంది అభ్యర్థుల తొలి జాబితాలో మాధవి లత పేరుని ప్రకటించడం బలహీన నియోజకవర్గాలపై బీజేపీ సీరియస్ గా దృష్టి సారించిందని తెలుస్తోంది.
End of Article