అలాంటి మహిళలు కూడా ఉచిత బస్సు వాడితే బిచ్చమెత్తుకునట్టే.. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్..! నిజమే అంటారా..?

అలాంటి మహిళలు కూడా ఉచిత బస్సు వాడితే బిచ్చమెత్తుకునట్టే.. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్..! నిజమే అంటారా..?

by kavitha

Ads

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. 6 గ్యారంటీలు అమలులో మహాలక్ష్మి పథకంలో భాగంగా  మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్‌జెండర్లకు టిఎస్ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ అవకాశంను కల్పించారు.

Video Advertisement

అయితే ఈ పథకం పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు చాలా ఉపయోగకరమని, ఈ పథకం  ద్వారా స్త్రీలకు ఆర్థిక తోడ్పాటు కలుగుతుందని అంటున్నారు. ఆటో డ్రైవర్లు తమ బతుకు రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం వల్ల ప్రభుత్వం పై భారం పెరిగి, డాన్ని భారతి చేయడానికి తిరిగి ప్రజల నుండే రకరకాల పన్నుల పేరుతో తిరిగి వసూలు చేస్తారని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకంలో భాగంగా మహిళలు తెలంగాణలో ఏ మూల నుండి నుండి ఎక్కడికైనా  సరే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం పల్లె వెలుగు బస్సులలో, సిటీఆర్డీనరీ మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులలో  ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఈ పధకాన్ని డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
మొదటి వారం ఎలాంటి కార్డు లేకున్నా ఉచిత ప్రయాణించే సౌకర్యం ఉండగా, ఆ తర్వాత నుండి టీఎస్ఆర్టీసీ మహిళలకు జీరో టికెట్లు జారీ చేసింది. ఐడీ కార్డును తప్పనిసరి చేసింది. ఆధార్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి  గుర్తింపు కార్డుల్లో ఏదొ ఒకటి కండక్టర్‌కు చూపించాలి.ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది.
uses of free buses in tsrtc గతంలో పన్నెండు లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా, ఈ పథకం తరువాత దాదాపుగా 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం పై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఫ్రీ ఎవరికి ఉండాలో వారికే ఉండాలి. పేయింగ్ కెపాసిటీ ఉండి నెలకు పది  వేలు సంపాదిస్తూ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే, నా దృష్టిలో వారు బిచ్చమెత్తుకున్నట్లే” అంటూ వెంకటరమణా కామెంట్స్ చేశారు.

https://www.instagram.com/reel/C1_sMETplmK/?igsh=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: ఆ పోస్టర్ ని స్వయంగా తానే కారుకి అంటించుకున్న “సీఎం రేవంత్”.. ఇంతకీ ఆ పోస్టర్ లో ఏముందంటే..?

 


End of Article

You may also like