ఎన్ఠీఆర్ కెరీర్ లో రిజెక్ట్ చేసిన 7 సినిమాలు ఇవే..కానీ తర్వాత హిట్ అయ్యాయి.!

ఎన్ఠీఆర్ కెరీర్ లో రిజెక్ట్ చేసిన 7 సినిమాలు ఇవే..కానీ తర్వాత హిట్ అయ్యాయి.!

by Megha Varna

Ads

నందమూరి కుటుంబం నుండి వారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయినా హీరో జూనియర్ ఎన్టీఆర్.అన్ని రసాలు పండించగాల సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్ .అటు భారీ డైలాగ్స్ నుండి ఆశ్చయపరిచే డాన్సుల వరకు ఎన్టీఆర్ రూటే వేరు.బాలనటుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి స్టార్ హీరోగా మారి తనకంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఎన్టీఆర్.

Video Advertisement

ఎన్టీఆర్ కెరీర్ లో చాలా మంచి చిత్రాలు చేసారు కాగా అవి భారీ హిట్ గా బాక్స్ ఆఫీస్ ముందు నిలిచాయి అయితే మొదటగా ఎన్టీఆర్ దగ్గరకి వచ్చిన కొన్ని చిత్రాలను ఆయన రిజెక్ట్ చేసారు.కాగా ఆ చిత్రాలు బాక్స్ ఆఫీస్ ముందు సూపర్ సక్సెస్ సాధించి ఇండస్ట్రీ హిట్స్ గా నిలవడం విశేషం.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన టాప్ 7 చిత్రాల గురించి తెలుసుకుందాం..వివరాల్లోకి వెళ్తే ..

1) కిక్ ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా రవితేజ హీరో గా నటించారు.అయితే ఈ చిత్రం భారీ హిట్ గా బాక్స్ ఆఫీస్ ముందు నిలవగా దర్శకుడు సురేందర్ రెడ్డి ని టాప్ దర్శకుల లిస్ట్ లో చేరేలా చేస్తే రవితేజ కెరీర్ లోనే ఒక డిఫరెంట్ మూవీ గా నిలిచింది.

2)దిల్ సినిమా వి వి వినాయక్ దర్శకత్వం వహించగా నితిన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు.కాగా నితిన్ కు మంచి ఇమేజ్ ను తీసుకువచ్చింది ఈ చిత్రం.ఇన్నోసెంట్ గా ఉండే నితిన్ కు మాస్ ఇమేజ్ తీసుకు వచ్చింది ఈ చిత్రం.అప్పట్లో ఈ చిత్రం ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

3)కొరటాల శివ ,మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు.గ్రామాన్ని దత్తత తీసుకొనే సామాజిక అంశం మీద ఆధారపడి ఉంటుంది ఈ చిత్ర కథ.అయితే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అప్పటిదాకా ఉన్న రికార్డులను అన్ని తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

4)అప్పటిదాకా ఉన్న లవ్ స్టోరీస్ అన్నిటికంటే కూడా కొత్తగా ఉన్న లవ్ స్టోరీ సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య.ఈ చిత్రంలో నటించిన అల్లు అర్జున్ కు ఒక బ్రాండ్ క్రియేట్ అయింది ఈ చిత్రంతోనే.ఫీల్ మై లవ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికి కూడా చాలామందికి ఎప్పటికి నచ్చే చిత్రాలలో ముందు వరసలో ఉంటుంది ఈ అందమైన ప్రేమకథ.

5)కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్.ఇప్పటిదాకా వచ్చిన యాక్షన్ సినిమాలో బెస్ట్ రివెంజ్ స్టోరీ అతనొక్కడే అని చెప్పచ్చు .సురేందర్ రెడ్డి మేకింగ్ స్టైల్ తో ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది.

6)ఫ్యాక్షన్ బ్యాక్ డ్రోప్లో హై ఎమోషన్ లవ్ స్టోరీ తో బోయపాటి తెరకెక్కించిన చిత్రం భద్ర.ఈ చిత్రం బోయపాటి శ్రీనుకు మొదటి చిత్రం.కాగా ఇందులో హీరోగా మాస్ మహారాజ్ రవితేజ నటించారు.ఈ చిత్రంతోనే బోయపాటి స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా చేరారు.కాగా భద్ర చిత్రం భారీ విజయం నమోదు చేసుకోగా ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికి చెరిగిన ముద్ర వేసుకుంది ఈ చిత్రం.

7)వివి .వినాయక్ ,రవితేజ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కృష్ణ.ఈ చిత్రం అప్పట్లో సంక్రాంతి హిట్.భారీ కలెక్షన్స్ ను రాబట్టుకొని కమర్షియల్ గా మంచి విజయాన్ని నమోదు చేసుకొంది.కృష్ణ చిత్రంలో రవితేజ ,బ్రహ్మానందం మధ్య జరిగే కామెడీ సీన్స్ నేటికీ హైలైట్ గా నిలుస్తున్నాయి.ఈ చిత్రాన్ని ఇతర బాషలలో కూడా రీమేక్ చెయ్యగా అక్కడ కూడా విజయాన్ని నమోదు చేసుకుంది.

ఎన్ఠీఆర్ కెరీర్ లో రిజెక్ట్ చేసిన 7 సినిమాలు ఇవే..కానీ తర్వాత హిట్ అయ్యాయి.!


End of Article

You may also like