Ads
మిత్రదేశాలైన ఇండియా – నేపాల్ మధ్య 35 చదరపు కిలోమీటర్ల “కాలాపానీ” ప్రాంతం ఇరుదేశాల మధ్య చిచ్చు రాజేస్తోంది. తాజాగా ధార్చులా నుంచి లిపులేఖ్ (చైనా సరిహద్దు) వరకు ఇండియా లింక్ రోడ్డును ప్రారంభించడం ఈ గొడవకు కారణమైంది. వాస్తవానికి ఈ గొడవ నవంబర్ నెలలోనే ప్రారంభం అయినప్పటికీ … కొత్త రోడ్ ప్రారంభంతో మరోసారి చర్చకు వచ్చింది.
Video Advertisement
కాలాపానీ ఎక్కడుంది…. వివాదం ఎందుకు ?
ఇండియా – నేపాల్ – చైనా …ట్రై జంక్షన్ లో ఈ కాలాపానీ ప్రాంతం ఉంది. 35 చదరపు కిలోమీటర్ల విస్టీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం ,మహాకాళి నది జన్మస్థలం. జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినప్పుడు ఇండియా విడుదల చేసిన మ్యాప్ లో కాలాపానీ ని ఉత్తరాఖండ్ జిల్లాలో చూపించారు. నేపాల్ ఈ ప్రాంతాన్ని ధార్చులా జిల్లాలో చూపిస్తుంది.
నేపాల్ ఏమంటుంది?
ఇండియా -చైనా… యుద్ధ సమయంలో …మేము ఇండియా కు మా దేశాల్లోని చాలా ప్రాంతాలను ఇచ్చాము …ఆ ప్రాంతాలలో పోస్ట్ లు ఏర్పాటు చేసుకొని ఇండియా సైనికులు చైనాతో తలపడ్డారు… యుద్ధం తర్వాత అన్ని ప్రాంతాలను వదిలి వెళ్లిన ఇండియా ….కాలాపాని ప్రాంతాన్ని మాత్రం వదల్లేదు …అనేది వారి వాదన . ఇలా చేయడం సుగౌలి ఒప్పందం-1816 (ఈస్ట్ ఇండియా కంపెనీ -నేపాల్ మధ్య ఒప్పందం ) ఉల్లంఘనే అంటుంది నేపాల్ .
భారత్ ఏమంటుంది.?
కాలాపాని ప్రాంతాన్ని ఇప్పుడు కొత్తగా మా మ్యాప్ లో చూపించలేదు..ఎప్పటినుండో అది మా భూభాగం లోని ప్రాంతం అంటోంది. 1830 నుండి కాలాపానీ ఉన్నది అనే పన్ను రికార్డులను ఇండియా చూపిస్తోంది.
కాలాపానీ వ్యూహాత్మకంగా భారత్ కు మంచి సైనిక స్థావరం…చైనా ను అడ్డుకునేందుకు అనువైన ప్రాంతం .
End of Article