Ads
- చిత్రం : కోనసీమ థగ్స్
- నటీనటులు : హృధు హరూన్, బాబీ సింహా, అనశ్వర రాజన్.
- నిర్మాత : రియా శిబు, ముంతాస్ ఎం
- దర్శకత్వం : బృందా
- సంగీతం : సామ్ సి. ఎస్
- విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2023
Video Advertisement
స్టోరీ :
శేషు (హృధు హరూన్) తునికి చెందిన ఒక అబ్బాయి. శేషు ఒక అనాధ. అతను కోయిల (అనశ్వర రాజన్) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అనుకోని కారణాల వల్ల కాకినాడలోని జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడి నుండి తప్పించుకొని ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలో అక్కడ జైల్లో ఉన్న దొర (బాబీ సింహా), మధు (మునిష్కాంత్) కూడా అక్కడి నుండి తప్పించుకోవాలి అనుకుంటారు.
దాంతో వారందరూ కలిసి జైలు నుండి బయటకు వెళ్లడానికి ప్లాన్ వేస్తారు. ఇందులో వారు విజయం సాధించారా? అ జైలు నుండి బయటికి వచ్చారా? అసలు వాళ్ళందరూ జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? శేషు చివరికి తను ప్రేమించిన కోయిలని కలుస్తాడా? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఎన్నో సినిమాలకి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్. బృందా మాస్టర్ గత సంవత్సరం హే సినామిక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాకి బృందా మాస్టర్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు తాను దర్శకత్వం వహించిన రెండవ సినిమాతో బృందా మాస్టర్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
ఈ సినిమా తమిళ్ సినిమా అయినా కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా మలయాళ సినిమా అయిన స్వాతంత్య్రం అర్ధరాత్రియిల్ అనే సినిమాకి రీమేక్. కథనంలో పెద్దగా మార్పులు చేయలేదు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో శేషు పాత్రలో నటించిన హీరో కొత్తవాడు అయినా కూడా చాలా సహజంగా నటించాడు. బాబీ సింహ కూడా తన పాత్రలో చాలా బాగా నటించారు.
సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా శేషు అనే ఒక వ్యక్తి గురించి చెప్పడంలోనే అయిపోతుంది. చాలా వరకు సాగదీసినట్టు అనిపిస్తుంది. దాంతో ప్రేక్షకులకి సినిమా చూడాలి అనే ఆసక్తి కూడా పోతుంది. సినిమా కథ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అయినా కూడా చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి స్టోరీ లైన్ ఉన్న సినిమాలకి స్క్రీన్ ప్లే ఎంత ఫాస్ట్ గా ఉంటే సినిమా ప్రేక్షకులకు అంత సస్పెన్స్ గా అనిపిస్తుంది.
కానీ ఈ సినిమా విషయంలో మాత్రం స్క్రీన్ ప్లే చాలా డల్ గా అనిపిస్తుంది. దాంతో సినిమా చూసే ప్రేక్షకులు అసహనానికి గురి అయ్యే అవకాశం కూడా ఉంది. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. పాటలు, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా ఒక సీరియస్ సినిమా చూస్తున్నాం అని ఫీల్ వచ్చేలాగా ఉన్నాయి. అలాగే లొకేషన్స్ కూడా చాలా సహజంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్
- సాంకేతిక విలువలు
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
- డల్ గా సాగే ఫస్ట్ హాఫ్
- సాగదీసినట్టుగా ఉండే సీన్స్
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
సినిమా స్టోరీ లైన్ బాగుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇటీవల కాలంలో వచ్చిన చాలా సినిమాల కంటే ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంది. కానీ, కథనం విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక సీరియస్ సినిమా చూద్దాం అనుకునే వారికి కోనసీమ థగ్స్ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article