“హ్యాపీ”లో ఉన్న ఈ బిగ్‌బాస్ తెలుగు-5 కంటెస్టెంట్ ని గుర్తు పట్టారా..?

“హ్యాపీ”లో ఉన్న ఈ బిగ్‌బాస్ తెలుగు-5 కంటెస్టెంట్ ని గుర్తు పట్టారా..?

by Mohana Priya

Ads

అల్లు అర్జున్, జెనీలియా హీరోహీరోయిన్లుగా వచ్చిన సినిమా హ్యాపీ. ఈ సినిమాకి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ గారు నిర్మించారు. అప్పట్లో వచ్చిన హిట్ లవ్ స్టోరీస్ లో ఒకటీగా హ్యాపీ నిలిచింది.

Video Advertisement

ఇప్పటికి కూడా ఈ సినిమా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా పాటలు అయితే చాలా మంది ప్లేలిస్ట్‌లో ఇప్పటికి కూడా ఉంటాయి.

bogg boss telugu 5 contestant in happy movie

 

అయితే, ఇందులో ఒక చోట బిగ్‌ బాస్ తెలుగు ద్వారా పాపులర్ అయిన కంటెస్టెంట్ ఒకరు కనిపిస్తారు. హ్యాపీ సినిమాలో ఐ హేట్ యు అనే పాటలో బిగ్ బాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఫేమస్ అయిన అనీ మాస్టర్ కనిపిస్తారు. అనీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలకి కొరియోగ్రఫీ చేసారు.  అలాగే ఢీ ప్రోగ్రామ్‌లో జడ్జిగా కూడా వచ్చారు.

bogg boss telugu 5 contestant in happy movie

పైసా వసూల్ సినిమాలో ఒక పాటకి కొరియోగ్రఫీ చేశారు. అంతే కాకుండా ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన లవ్ స్టోరీ సినిమాలో కూడా ఒక పాటకి కొరియోగ్రఫీ చేశారు అనీ మాస్టర్. ఆ పాటలో ఒక షాట్ లో కూడా కనిపిస్తారు. అనీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడం చాలా మంది ఊహించలేదు. ఇంక షో విషయానికొస్తే ఇటీవల జరిగిన నామినేషన్ లో రవి ఎలిమినేట్ అవడం గమనార్హంగా నిలిచింది.


End of Article

You may also like