ఓ అద్భుతమైన లవ్ ప్రపోజల్ సీన్ ఇది. తన ప్రియురాలిని సముద్రాలు దాటించి.. ఈఫిల్ టవర్ ఎదుట.

ఓ అద్భుతమైన లవ్ ప్రపోజల్ సీన్ ఇది. తన ప్రియురాలిని సముద్రాలు దాటించి.. ఈఫిల్ టవర్ ఎదుట.

by Megha Varna

వాలెంటైన్స్‌ డే– ప్రేమికుల దినోత్సవం దగ్గర పడింది. ప్రపంచమంతా ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలెంటైన్‌ వీక్‌ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 7 రోజ్‌ డే, ఫిబ్రవరి 8 ప్రపోజ్‌ డే, ఫిబ్రవరి 9 చాక్‌లెట్‌ డే, ఫిబ్రవరి 10 టెడ్డీ డే, ఫిబ్రవరి 11 ప్రామిస్‌ డే, ఫిబ్రవరి 12 హగ్‌ డే, ఫిబ్రవరి 13 కిస్‌ డే చివరిగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే జరుపుకోనున్నారు. ఓ యువతికి బాలీవుడ్ స్టైల్‌లో లవ్ ప్రపోజ్ చేసిన వీడియోకి నెటిజన్లు ఫిదా అయ్యారు. రెండు వారాల్లో పన్నెండున్నర లక్షల మందికిపైగా ఈ వీడియోను చూశారు.ఏ ప్రేమికుడికైనా తన లవర్‌కి జీవితకాలం గుర్తుండిపోయేలా ప్రపోజ్ చేయాలని ఉంటుంది. ఊహించని రీతిలో ప్రియుడు తన ప్రేమను చెబుతూ ఎదుట నిలిస్తే.. ఆ యువతి కూడా కలయా నిజమా అన్న ఫీలింగ్‌లో ఉండడం కామన్. అలాంటి ఓ అద్భుతమైన లవ్ ప్రపోజల్ సీన్ ఇది. తన ప్రియురాలిని సముద్రాలు దాటించి.. ఈఫిల్ టవర్ ఎదుట.. స్నేహితులు, కుటుంబసభ్యుల మధ్య.. బాలీవుడ్ స్టైల్‌లో డాన్స్ చేస్తూ.. ఓ యువకుడు తన ప్రేమను వ్యక్తం చేశాడు.

Video Advertisement

అతడి పేరు శ్యామ్ షా న్యూయార్క్‌లో ఉంటాడు ఆమె పేరు శివానీ బాఫ్నా ముంబైలో ఉంటుంది ,అనుకోకుండా 2015లో ఇద్దరూ ఓ డ్యాన్స్ షో లో కలిశారు.అదిరిపోయే డాన్స్ చేసిన ఆ ఇద్దరూ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్‌ అయ్యారు. అది కాస్తా ప్రేమగా మారింది. దాదాపు ఏడాదిన్నరగా లవ్‌లో ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఉండేది ఏమో చాల దూరం, ఒకరినొకరు మిస్స్ అవుతున్న ఫీలింగ్ లోనుంచి ఓ అద్భుతమైన ఆలోచనతో ఈఫిల్ టవర్ దగ్గర లవ్ ప్రపోజ్ చేశాడు శ్యామ్.ఆమెను ప్యారిస్‌కి రప్పించి.. ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి తను ఐ లవ్ యూ చెప్పే వరకూ మొత్తం వీడియో తీయించాడు.ఈ వీడియో రెండు వారాల్లో 13.57 లక్షల మందికి పైగా చూశారు. వాలంటైన్స్ డే దగ్గర పడడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.


You may also like

Leave a Comment