అలనాటి అందాల తారగా సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తన అందం, అభినయంతో మొదటి సినిమాతోనే అందరి దగ్గర మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

Video Advertisement

 

అలా వరుస సినిమాలతో హిట్ సాధించిన ఈ బాలివుడ్ బ్యూటీ.. టాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఎన్‌టీఆర్ సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షుటింగ్ పనుల్లో జాన్వీ బిజీగా ఉన్నారు. కానీ సౌత్‌లో ఎంట్రీ ఇచ్చే ముందు తండ్రి బోనీ కపూర్ జాన్వీకు హీరోల విషయంలో కొన్ని కండీషన్‌లు పెట్టారంటారని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

జాన్వీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు విజయ్ లేదా అజిత్ వంటి అగ్రహీరోల సరసన నటించి ఎంట్రీ ఇవ్వాలని బోనీ కపూర్ కండీషన్ పెట్టారటా. అలాగే కోలీవుడ్‌లో హీరో ధనుష్‌తో మాత్రం ఏ సినిమాలోనూ నటించవద్దని కూడా బోనీ కపూర్ కండీషన్ పెట్టారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు, తమిళంలో నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు అందుకున్న ధనుష్‌తో సినిమాలు చేయడానికి ఎంతో హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ బోనీ కపూర్ తన కూతురుని ధనుష్‌తో నటించవద్దనే కండీషన్ ఎందుకు పెట్టారో తెలియడం లేదు. కానీ ధనుష్ ఫ్యాన్స్ మాత్రం ఈ కండీషన్‌కి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.