సినీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోయిన్.. అతిలోక సుందరి శ్రీదేవి మ-ర-ణిం-చి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆ వార్తపై ఎవరికి నమ్మకం లేదు. ఇప్పటికీ ఆమె సినిమాలు చూసినప్పుడు ఆమె సజీవంగానే ఉంది అని ప్రేక్షకులు భావిస్తారు.

Video Advertisement

అనుమానాస్పదంగా మరణించిన శ్రీదేవి మరణం వెనుక అసలు కారణం ఇదేనని.. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె భర్త బోనీ కపూర్ మొదటిసారిగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన శ్రీదేవి మరణం వెనక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించారు.

boney kapoor on sridevi issue

దుబాయ్ లో ఒక పెళ్లి అటెండ్ అవ్వడానికి వెళ్ళిన శ్రీదేవి బాత్రూంలో హఠాన్మరణం చెందిన తర్వాత ఆమె మరణంపై పలు రకాల అనుమానాలు తలెత్తాయి. ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆమె డె-త్ ఒక మిస్టరీ అనే చెప్పాలి. ఈ విషయంలో చాలామంది ఆమె భర్త బోనీ కపూర్ కి సంబంధం ఉంది అని పరోక్షంగా అనడం జరిగింది. అయితే ఈ వార్తలకు ఇప్పటివరకు ఎప్పుడు స్పందించని బోనీ కపూర్ మొదటిసారి తన మనసులోని మాట బయటపెట్టారు.

నిజానికి శ్రీదేవికి సహజ మరణం కాదట…అది కేవలం ప్రమాదవశాత్తు చోటు చేసుకుంది అని ఆయన స్పష్టంగా వివరించి చెప్పారు. ఈ సందర్భంగా శ్రీదేవి కి సంబంధించిన మరొక రహస్యాన్ని కూడా బయటపెట్టారు. శ్రీదేవి అందంగా కనిపించడం కోసం కఠినమైన డైట్ ఫాలో అయ్యేవారట. ఫిగర్ మెయింటైన్ చేయడం కోసం ఎప్పుడు ఉప్పు లేని ఆహారాన్ని తీసుకునే వారట. దీని కారణంగా లో బిపి సమస్య తలెత్తడంతో చాలాసార్లు ఆమెకు నీరసం వచ్చేదట. ఇలా పలు సందర్భాలలో శ్రీదేవి కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది అని ఆయన వెల్లడించారు.

ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అని డాక్టర్లు చెప్పినప్పటికీ శ్రీదేవి దీన్ని సీరియస్ గా తీసుకోలేదట. అయితే శ్రీదేవి చనిపోయిన తర్వాత పాపం బోనీ కపూర్ ని దుబాయ్ పోలీసులు ఒక రోజంతా విచారించడమే కాకుండా లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారట. ఇది జరిగిన కొన్ని రోజులకు బోనీ కపూర్ ని కలిసిన నాగార్జున కూడా ఒకసారి డైట్ కారణంగా సినిమా సెట్ లో శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారట. అంటే దుబాయ్ హోటల్ బాత్రూంలో కూడా శ్రీదేవి అలాగే కళ్ళు తిరిగి జారిపడి ఉండొచ్చు అనే విషయం స్పష్టం అవుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా…అందం కోసం ఆఖరికి అతిలోకసుందరి ప్రాణాల మీదకే తెచ్చుకుంది అని నెటిజెన్స్ బాధపడుతున్నారు

ALSO READ : ఇదెక్కడి ఘోరం..! ఇంటర్నేషనల్ లెవల్‌లో హైదరాబాద్ పరువు తీశారు..!