ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే ఏలేసే అంత పెద్ద హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే ఏలేసే అంత పెద్ద హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

by kavitha

Ads

సినిమాల్లో ఎంతోమంది బాలనటులుగా నటించి, పెద్దయ్యక హీరోలుగా ఎంట్రీ ఇచ్చినవారు ఎందరో ఉన్నారు. అయితే వారిలో స్టార్ హీరోగా ఎదిగి, ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నవారు మాత్రం కొందరే అని చెప్పవచ్చు. ఆ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, అవి క్షణాల్లో వైరల్ గా మారడం  తెలిసిందే.

Video Advertisement

అలా చిన్నప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్న టాలీవుడ్ స్టార్ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
పైన కనిపిస్తున్న ఫోటోలోని అబ్బాయి, బాలనటుడుగా ఎన్నో సినిమాలలో నటించి, పేరు ప్రఖ్యాతులను మాత్రమే కాకుండా ఒక హీరోకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను, క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. పెద్దయ్యాక తండ్రి వారసత్వాన్ని అందుకుని తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. అమ్మాయిల కలల రాజకుమారుడిగా మారాడు. వరుస సినిమలలో నటిస్తూ, ఎన్నో హిట్ సినిమాలలో నటించి, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తూ, అవార్డులు అందుకుని, తండ్రిలాగే సూపర్ స్టార్ గా పేరుగాంచారు. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలు చేస్తూనే, యాడ్స్ లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే మహేష్ చేతిలో చాలా యాడ్స్ ఉన్నాయి. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. టాలీవుడ్ లో ఎవ్వరు చేయనన్ని యాడ్స్ మహేష్ బాబు చేశారు. అలా  యాడ్స్ చేయడానికి కారణం ఒక సందర్భంలో మహేష్ వివరించారు.
mahesh-babu-rare-record2వాటి వల్ల సంపాదించే డబ్బుతో పేద పిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్స్ చేయిస్తారు. పిల్లల కోసమే ఒక ఫౌండేషన్ ను సొంతంగా ఏర్పాటు చేసి ఉచిత హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. అలా ఇప్పటివరకు వెయ్యికి పైగా చేయించారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. కేవలం డబ్బు ఇచ్చే సంస్థల కోసమే కాకుండా సేవ చేసే పలు సంస్థలకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ గుంటూరుకారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: MARK ANTONY REVIEW : “విశాల్, SJ సూర్య” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like