“ఆదిపురుష్” సినిమాకి ఒక 8 ఏళ్ళ అబ్బాయి రియాక్షన్ చూస్తే నవ్వాగదు..!

“ఆదిపురుష్” సినిమాకి ఒక 8 ఏళ్ళ అబ్బాయి రియాక్షన్ చూస్తే నవ్వాగదు..!

by kavitha

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఆడియెన్స్ మొదలుకొని ప్రముఖుల వరకు ఈ చిత్రం పై విమర్శలు చేస్తున్నారు. రామాయణంను ఆదిపురుష్ పేరుతో అపహాస్యం చేశారని, ఈ మూవీని బ్యాన్ చేయాలని నిరసనలు తెలుపుతున్నారు.

Video Advertisement

హనుమంతుడి సంభాషణల పై తీవ్ర దుమారం రావడంతో మేకర్స్‌ వాటిని మార్చారు. తాజాగా ఈ చిత్రం చూసిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఈ మూవీ పై కామెంట్‌ చేశాడు. ఇక కోరాలో ఈ సినిమా పై చర్చ ఎక్కువగానే జరుగుతోంది. ఈ సినిమా పై అడిగిన ఒక ప్రశ్నకు, ఒక యూజర్ సమాధానం ఇచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కోరాలో “ఆదిపురుష్ సినిమా flop అవ్వడానికి ఒక్క సీన్ చెప్పండి” అని అడిగిన ప్రశ్నకు సంతోష్ కుమార్. కె అనే యూజర్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. “లాస్ట్ ఆదివారం మా అబ్బాయి, వాళ్ళ పెద నాన్న మరియు వాళ్ళ పిల్లలతో కలసి ఆదిపురుష్ సినిమాకు ఐనాక్స్ కి వెళ్లారు. మా అబ్బాయి వయస్సు 8 ఏళ్ళు. మూవీ చూసి వచ్చిన తరువాత సినిమా ఎలా ఉంది అని అడిగితే, మా అబ్బాయి ఏం బాలేదు డాడి, విలన్ హీరోయిన్ ని ఎత్తుకెళ్తాడు. హీరో వెళ్ళి విలన్ ని చంపి, హీరోయిన్ ని కాపాడుతాడు. అతనికి కోతులు, చింపాజీలు సహాయం చేస్తాయి.
adipurushమా ఆవిడ బాబుకి ఆ మూవీ రామాయణ కథ అని చెప్పడానికి ప్రయత్నిస్తే వద్దని వారించాను. వాడిని అదే ఆలోచనతో నే ఆ మూవీని చూడనీ లేదంటే అదే రామాయణం అని పొరపాటు పడే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. దాదాపు అదే వయసులో ఉన్నప్పుడు మేము చూసిన రామాయణ సినిమాలు ఇప్పటికి కళ్ళ ముందు ఉన్నాయి. ఆ మూవీ చూసి వచ్చిన తరువాత మా నానమ్మను ప్రశ్నలతో విసిగించేవాళ్ళం, బాగా ఆకట్టుకున్న మూవీ మాత్రం సీతా కళ్యాణం” అని సమాధానం ఇచ్చారు.

Also Read: “ఈ విషయం ఇప్పుడు అర్ధం అయ్యింది..!” అంటూ… “ఆదిపురుష్” పై సెహ్వాగ్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like