బాయ్స్ సినిమా లో నటించిన వాళ్లంతా స్టార్స్ అయ్యారు.. కానీ ”మణికందన్” మాత్రమే ఇలా..? కారణం ఇదే..!

బాయ్స్ సినిమా లో నటించిన వాళ్లంతా స్టార్స్ అయ్యారు.. కానీ ”మణికందన్” మాత్రమే ఇలా..? కారణం ఇదే..!

by Mounika Singaluri

Ads

శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. 2002లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో హీరోల కింద సిద్ధార్థ్, థమన్, నకుళ్, మణికందన్ నటించారు. అలానే ఈ సినిమాలో జెనీలియా కూడా నటించారు. అయితే ఈ సినిమాలో అబ్బాయిల చదువు కెరియర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది దర్శకుడు చూపించారు.

Video Advertisement

కెరియర్ యొక్క ప్రాముఖ్యతని చెబుతూ.. ఈ నలుగురు జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలని కూడా ఈ చిత్రం ద్వారా తెర మీదకి తీసుకువచ్చారు శంకర్.

ఈ సినిమాలో హీరోలైన ఈ నలుగురికీ కూడా ఇదే ఫస్ట్ మూవీ. హీరోయిన్ గా నటించిన జెనీలియాని దర్శకుడు శంకర్ పార్కర్ పెన్ అడ్వర్టైజ్మెంట్ లో చూసి ఈ అవకాశాన్ని ఇచ్చారట. అయితే ఈ సినిమాలో నటించిన ఈ నటులకి తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి. జెనీలియా కూడా తర్వాత చాలా సినిమాలు చేశారు. హిందీ నటుడు రితేష్ దేశముఖ్ ని ఆమె వివాహం చేసుకున్నారు. స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదిగిపోయారు.

బాయ్స్ సినిమా తర్వాత ఆమె చాలా సినిమాలు చేసారు. ఇక నకుల్ అయితే దేవయాని తమ్ముడు. దేవయాని తమ్ముడిగానే ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. సినిమాలతో పాటుగా బుల్లితెర మీద కూడా కనబడుతూ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు. థమన్ గురించి అందరికీ తెలిసిందే. థమన్ ఇప్పుడు మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సిద్ధార్థ గురించి చెప్పక్కర్లేదు. బాయ్స్ సినిమా తరవాత సిద్ధార్థ చాలా సినిమాలు చేశారు.

కానీ మణికందన్ మాత్రం మంచి నటుడు కాలేకపోయారు. విలన్ గా కూడా నటించేందుకు ప్రయత్నం చేశారు కానీ ఫలించలేదు. 20 ఏళ్ల నుండి చూస్తే కేవలం ఎనిమిది సినిమాల్లో మాత్రమే నటించారు. పైగా అయిన లుక్ గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు. స్క్రిప్ట్స్ ని సరిగ్గా ఎంచుకోకుండా తప్పులు చేశారు. లైఫ్ లో కూడా ఇంకా సెటిల్ కాలేకపోయారు. 40 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా వివాహం అవ్వలేదు. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం చూస్తున్నారు. ఏదైనా అవకాశాలు వస్తే నటించాలని భావిస్తున్నారు.


End of Article

You may also like