Ads
వెండితెర పై సినిమా ఎలాగో, బుల్లితెరపై సీరియల్ అటువంటిదే అని చెప్పవచ్చు. అయితే సినిమా ఎన్ని నెలలు కష్టపడి తీసినా, మొదటి షోతోనే ఆ మూవీ విజయం సాధిస్తుందో లేదో తెలుస్తుంది. అయితే సీరియల్ విషయంలో అలా ఉండదు. ప్రతి వీక్ టీఆర్‌పీ రేటింగ్ గండం లాంటిదే.
Video Advertisement
ఇక సీరియల్ డైరెక్టర్ కి షూటింగ్ అంటే యుద్ధంలా ఉంటుందని చెప్పవచ్చు. అందులో నటించే నటినటుల కాల్ షీట్స్ చూసుకోవాలి. రెండు, మూడు ఎపిసోడ్స్ కూడా ఒకే రోజు చిత్రీకరించాల్సి వస్తుంటుంది. ఇన్నింటిని దాటుకుని ఒక డైరెక్టర్ ఒకేసారి రెండు సీరియల్స్ ను తీస్తూ, వాటిని టీఆర్‌పీలో అగ్రస్థానంలో ఉండేలా చేశారు. మరి ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
గుప్పెడంత మనసు స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రిషి, వసు లవ్ స్టోరీ, తల్లీకొడుకుల సెంటిమెంట్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సీరియల్ కు వంద ఎపిసోడ్స్ వరకు కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర తెరకెక్కించారు. ఆ తరువాత కుమార్ పంతం డైరెక్ట్ చేస్తున్నారు.
అప్పటి నుంచి ఈ సీరియల్ టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్‌కి చాలా పోటీ ఇచ్చింది. ఒకానొక సమయంలో గుప్పెడంత మనసు ‘కార్తీక దీపం’ సీరియల్ ను మించుతుందేమో అనేట్టుగా కుమార్ పనిచేశారు. కార్తీక దీపం సీరియల్ కి ఎండ్ కార్డు పడిన తరువాత. అదే టైమ్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ను అద్భుతంగా కుమార్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సీరియల్ గత కొన్ని నెలలుగా టీఆర్‌పీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. కార్తీక దీపం సీరియల్ ను ఆడియెన్స్ ఎంతగా ఆదరించారో తెలిసిందే. ఆ సీరియల్ ను ప్రేక్షకులకు గుర్తు రాకుండా ఇంట్రెస్టింగ్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ బ్రహ్మముడి దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అతను ప్రముఖ సీరియల్ నటి కిరణ్మయి భర్త. ఆమె ఎన్నో సీరియల్స్ లో నటించింది.
https://www.instagram.com/p/CeIdDNbLw3w/
End of Article