Home Filmy Adda “బాలూ.. నువ్వు పాడుతున్న పాటేంటి… ఆ రాగమేంటి..?”… వైరల్ అవుతున్న “పాడుతా తీయగా” వీడియో..!

“బాలూ.. నువ్వు పాడుతున్న పాటేంటి… ఆ రాగమేంటి..?”… వైరల్ అవుతున్న “పాడుతా తీయగా” వీడియో..!

by Mohana Priya

శ్రీను వైట్ల, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కింగ్ సినిమా విడుదల అయ్యి పన్నెండు సంవత్సరాలయింది. ఈ సినిమాలో త్రిష, మమత మోహన్ దాస్ హీరోయిన్లుగా నటించారు. శ్రీహరి గారు ఒక కీలక పాత్ర పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

ఇంక కింగ్ సినిమాకి ముఖ్య హైలైట్ బ్రహ్మానందం గారు. ఆయన పోషించిన జయసూర్య పాత్రని, ఆ పాత్రలో ఆయన మాట్లాడిన డైలాగ్స్ ని ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా సినిమా పాపులారిటీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది అంటే అందులో పాత్రలు, వాళ్ల ఎక్స్ప్రెషన్స్ ఎంత ఐకానిక్ గా ఉంటాయో మనమే అర్థం చేసుకోవాలి.

brahmanandam recreates king scene in paaduta teeyaga

సోషల్ మీడియాలో ఏదైనా ఒక మీమ్ పేజ్ చూస్తే అందులో కింగ్ సినిమాకి సంబంధించిన టెంప్లేట్స్ చాలానే కనిపిస్తాయి. అదే ఒక వేళ సోషల్ మీడియాలో ఉన్న మొత్తం తెలుగు మీమ్ పేజెస్ చూస్తే కొన్ని వేలల్లో ఉంటాయేమో. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిన డైలాగ్స్ రాసింది బి.వి.ఎస్.రవి. ఇంకా బ్రహ్మానందం గారు పోషించిన జయసూర్య పాత్రకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

brahmanandam recreates king scene in paaduta teeyaga

అందులో బ్రహ్మానందం గారు చెప్పే డైలాగ్స్ కూడా అందరికీ గుర్తుంటాయి. ఇందులో బ్రహ్మానందం గారు ఒక కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు చెప్పే డైలాగ్స్ కి పేరడీ తర్వాత చాలా చోట్ల విన్నాం. అయితే బ్రహ్మానందం గారు ఒక సందర్భంలో పాడుతా తీయగా ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు అదే సీన్ రీక్రియేట్ చేశారు. బ్రహ్మానందం గారితో పాటు లెజెండ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కూడా ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

watch video :

https://www.instagram.com/tv/CZd5n0klCFd/?utm_medium=copy_link

You may also like