మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్లలో టాప్ కమెడియన్ ఎవరు అంటే ఆలోచించకుండా అందరి నోటి నుండి వచ్చే ఒకే ఒక సమాధానం బ్రహ్మానందం గారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రకాల కామెడీ పాత్రలతో మనందరినీ అలరిస్తున్నారు బ్రహ్మానందం గారు. అయితే బ్రహ్మానందం గారు గత కొన్ని సంవత్సరాల నుండి సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. తన ఆరోగ్యం దృష్ట్యా ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు బ్రహ్మానందం గారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో రాములో రాముల పాటలో కొన్ని సెకండ్లు కనిపిస్తారు. బ్రహ్మానందం గారు అలా స్క్రీన్ మీద కనిపించిన కొన్ని సెకండ్లను కూడా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. ఇటీవల నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన జాతి రత్నాలు సినిమాలో కూడా జడ్జ్ గా నటించారు బ్రహ్మానందం గారు. అయితే ఇప్పుడు బ్రహ్మానందం గారు మళ్లీ తిరిగి సినిమాల్లో నటించబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బ్రహ్మానందం గారు ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారట. ఇందులో ప్రభాస్ కి, బ్రహ్మానందం గారికి మధ్య వచ్చే కామెడీ ట్రాక్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందట. ఒకవేళ ఇదే నిజమైతే మళ్లీ అతిధి పాత్రలో కాకుండా ఒక ఫుల్ లెన్త్ పాత్రలో బ్రహ్మానందం గారిని తెరపై చూడొచ్చన్నమాట. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ప్రాజెక్ట్ కే అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమయ్యింది.