Ads
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ఈ సినిమా తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించారు.
Video Advertisement
ఇప్పటికే ఈ సినిమాలోని కుంకుమలా అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎన్నో కారణాల వల్ల ఆలస్యం అయింది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. వీరు మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ నాగార్జున ఒక బాలీవుడ్ సినిమాలో నటించారు. అంతకు ముందు నాగార్జున కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించారు. క్రిమినల్ లాంటి సినిమాలతో అక్కడ కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ సినిమా మూడు భాగాలుగా విడుదల అవుతోంది. ఈ సినిమా మొదటి భాగం ఇప్పుడు విడుదల అవుతుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్ మీట్ కి జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా వచ్చారు. ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్నారు. దాంతో రాజమౌళి కూడా సినిమా బృందంతో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా మొదటి రివ్యూ ఇచ్చారు.
ఈ సినిమా గురించి ఉమైర్ సంధు మాట్లాడుతూ, “బ్రహ్మాస్త్ర సినిమాలో చెప్పుకునేంతగా ఏమి లేదు. బాక్సాఫీస్ దగ్గర సినిమా స్టార్టింగ్ బాగున్నా కూడా, తర్వాత కష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా జనాలని కట్టిపడేసే లాగా లేదు. సినిమా అయితే నిలవడం కష్టమే” అని రాశారు. అలాగే తర్వాత కూడా దీని గురించి మాట్లాడుతూ, “బ్రహ్మాస్త్ర సినిమాలో విఎఫ్ఎక్స్ బాగున్నాయి. రెండు యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. పాటలు చాలా బాగున్నాయి” అని చెప్పారు.
“రణబీర్ కపూర్ అయోమయంగా కనిపిస్తున్నాడు అసలు అతను తెరపై ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. కానీ ఆలియా భట్ నటన రణబీర్ కపూర్ కంటే చాలా బాగుంది. చూడటానికి కూడా ఆలియా భట్ చాలా బాగుంది” అని రాశారు. అయితే ఉమైర్ సంధు గతంలో చాలా సినిమాలకి రివ్యూలు ఇచ్చారు. అందులో చాలా తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.
ఇటీవల విడుదలైన లైగర్ సినిమాకి కూడా ఉమైర్ సంధు చాలా బాగుంది అంటూ రివ్యూ ఇచ్చారు. కానీ సినిమా చూస్తే మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకి ఏమో ఈ విధంగా రివ్యూ ఇచ్చారు. దాంతో ఈ సినిమా గురించి ఇలా అన్నారు కాబట్టి కచ్చితంగా బాగుంటుందేమో అని అంటున్నారు. ఏదేమైనా ఈ రివ్యూలో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదలయ్యే అంత వరకు ఆగాల్సిందే.
End of Article