గత కొంత కాలం నుండి లాక్ డౌన్ కారణంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రాని ప్రజలు, ఇప్పుడు కొంచెం రూల్స్ సడలించడం తో ఎప్పటిలాగా కాకపోయినా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే బయటికి వెళ్ళడం మొదలు పెట్టారు. కానీ ఇటీవల వచ్చిన వరదల కారణంగా ప్రజలందరూ మళ్లీ ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు రెండు రోజులు ఆగకుండా కురిసిన వర్షం తో, వరద నీరు మొత్తం రోడ్లపై నిలిచిపోయింది.

అంతే కాకుండా చాలా ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లల్లోకి కూడా వెళ్లి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు భారీ వర్షాల కారణంగా విద్యుత్ తీగలు పడిపోవడం, లేదా ట్రాన్స్ఫార్మర్ల లో సమస్యలు రావడం వల్ల చాలా ప్రాంతాల్లో పవర్ కట్ సమస్య కూడా ఎదురైంది.

బ్రహ్మం గారు తన కాల జ్ఞానంలో భవిష్యత్తులో జరగబోయే ఘటనలు అన్నీ వివరించారు. ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు సంఘటనలు నిజంగానే జరుగుతాయి. ఇది చదవంగానే మీలో చాలా మందికి విషయం ఈ పాటికే అర్ధమైపోయి ఉంటుంది. అదేంటంటే. శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా లో, “హైదరాబాద్ ను మూసీ మహా నది వరద తోటి ముంచి వేసేను” అని ఒక లైన్ ఉంటుంది. ఇప్పుడు నిజం గానే మూసి దగ్గర వరద నీళ్ల ఉధృతి కారణంగా కార్లు, లారీలు కూడా కొట్టుకుపోతున్నాయి.

బ్రహ్మం గారు చెప్పినవి నిజం అవ్వడం ఇదే మొదటి సారి కాదు. అంతకు ముందు కూడా కొన్ని సంఘటనలు దాదాపుగా బ్రహ్మం గారు కాల జ్ఞానంలో చెప్పినట్టే జరిగాయి.

Watch Pothuluri Veerabrahmendra Swamy Kalagnanam