వీడియో కాన్ఫరెన్స్ లో అధ్యక్షకుడికి చేదు అనుభవం.

వీడియో కాన్ఫరెన్స్ లో అధ్యక్షకుడికి చేదు అనుభవం.

by Megha Varna

Ads

కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి.దీంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.ఇప్పుడు విద్యార్థులు ఆన్లైన్ శిక్షణ తరగతులకు హాజరు అవుతున్నారు.కాగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు దగ్గర నుండి ఇతరత్రా ఉద్యోగులు కూడా ఇప్పుడు ఇంటికి నుండే పనిచేస్తున్నారు.ఎందుకంటే తద్వారా కరోనా వ్యాపించదు గనుక ఈ ఐడియా బాగానే వర్కౌట్ అయింది.ఇప్పుడు దేశ ప్రధానుల దగ్గర నుండి ఇతరత్రా రాజకీయనాయకుల వరుకు కూడా అందరూ ఆన్లైన్ లోనే సమీక్షించుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Video Advertisement

కొన్నిసార్లు చిన్న చిన్న తప్పిదాలు వలన ఇబ్బంది పడుతుంటే మరొకొన్నిసార్లు మాత్రం విపరితమైన కామెడీ చోటు చేసుకుంటుంది ..ఇలా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బాసినరో జరిపిన ఒక వీడియో కాన్ఫెరెన్స్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశం అయింది ..వివరాల్లోకి వెళ్తే ..బ్రెజిల్ అధ్యక్షుడు జైరో ఇతర మంత్రులు మరియు ప్రఖ్యాత బిజినెస్ మెన్ లతో ఒక ముఖ్యమైన వీడియో కాన్ఫిరెన్స్ ను జూమ్ ద్వారా నిర్వహించారు .ఆ సమయంలో ఒక వ్యక్తి ఒక పక్క విండో లో బట్టలు లేకుండా ఉండడాన్ని గమనించిన ఒక మంత్రి ఆ విషయాన్నీ లైవ్ లో తెలియపరిచారు.

అప్పుడు జైరో కూడా పరిశీలించి చూడగా ఆ వ్యక్తి బట్టలు లేకుండా నగ్నంగా ఉండడాన్ని గమనించారు.దీనిపై జైరో స్పందిస్తూ …ఇది చాలా గోరమైన దృశ్యం నా దురదృష్టవత్తు నేను చూడాల్సి వచ్చింది అని అన్నారు.దీనిపై మిగతా కాన్ఫరెన్స్ సభ్యులందరూ కూడా తెగ నవ్వుకున్నారు.ఆ నగ్నంగా ఉన్న వ్యక్తి ఒక బిజినెస్ మన్.వీడియో సమావేశం అయిపోయింది అనుకోని కనెక్షన్ ఆపకుండా స్నానం చెయ్యడానికి వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.వీడియో కాన్ఫరెన్స్ లో తప్పిదాలు జరగడం మాములే గాని మరి ఇంతలానా అంటూ పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు .


End of Article

You may also like