Ads
మామూలుగా పెళ్లి అంటే ఆడపిల్లలు సిగ్గుతో తలదించుకుని ఉంటారు అనే ఒక అపోహ ఉంది. అదంతా చెరిపేస్తూ ఆడ పిల్లలు కూడా తమ పెళ్లి వేడుకని ఆనందంగా జరుపుకుంటారు అని ఎంతోమంది అమ్మాయిలు నిరూపించారు. ఇటీవల ఒక యువతి కూడా అలాగే తన పెళ్లిలో బారాత్ లో డాన్స్ వేస్తూ వైరల్ అయ్యారు.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌వో రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఈ నెల 14వ తేదీన అశోక్ తో వివాహం జరిగింది. అశోక్ జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. అయితే శ్రీయ బారాత్ లో బుల్లెట్టు బండెక్కి పాటకి డాన్స్ వేశారు. ఈ పాటని మోహన భోగరాజు పాడారు. ఈ ఆల్బమ్ పాట ఇటీవల యూట్యూబ్ లో విడుదలయి వైరల్ అయ్యింది.
ఇప్పుడు శ్రీయ డాన్స్ ద్వారా ఇంకా వైరల్ అయ్యింది. ఈ విషయంపై శ్రీయ సాక్షితో మాట్లాడుతూ తన డాన్స్ ఇంత వైరల్ అవుతుంది అని అనుకోలేదు అని అన్నారు. ఈ పాటని యూట్యూబ్ లో దాదాపు 3.5 లక్షల మంది చూశారు. అంతే కాకుండా వీరిద్దరికి ఎంతోమంది విషెస్ అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
Bullettu Bandi Song Lyrics In Telugu>> Click Here
End of Article