సాధారణంగా పెళ్లి అంటే భారీ ఏర్పాట్లు చేయడం, వేలల్లో బంధుమిత్రులను పిలిచి భోజనాలు పెట్టడం.. ఇలా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఎన్నో రకాల ఆహార పదార్థాలను ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇలా ఎవరికి నచ్చినట్లు స్తోమతను బట్టి పెళ్లి జరుపుతారు. కానీ ఈమె మాత్రం తన పెళ్లిని కొత్త స్టైల్ లో చేసుకుంది. చూసి మొదట అందరూ షాక్ అయ్యారు కానీ తర్వాత ఆమెని అంతా ప్రశంసిస్తున్నారు. ఇక ఆమె పెళ్లి ఎలా వెరైటీగా చేసుకుందో చూద్దాం.

Video Advertisement

భోపాల్ కు చెందిన ఒక వధువు చాలా కొత్త పద్ధతిలో ఆలోచించింది. ఆమె పెళ్ళికి ముందు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక పని చేయాలని అనుకుంది. అందుకోసం ఆమె 150 మంది అనాధ పిల్లల్ని ఒక ఖరీదైన రెస్టారెంట్ కి తీసుకు వెళ్లి విందు భోజనం పెట్టించింది. మొదట రెస్టారెంట్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ ఆమె చేసిన మంచి పని చూశాక అభినందిస్తున్నారు.

23 ఏళ్ల ముబారికే సైఫీ అనే వైద్యురాలికి అబ్బాస్ అలీ తో వివాహం కుదిరింది. అయితే గురువారం వీళ్ళ పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి రెండు రోజులు ముందు ఈమె 150మంది పేద పిల్లల్ని మంచి రెస్టారెంట్ కి తీసుకు వెళ్లి అక్కడ వాళ్లకి భోజనం పెట్టించింది. పెళ్లికి ముందు ఈమె ఇలా భోజనం పెట్టడాన్ని చూసి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. నాకు ఇలా చేయాలని అనిపించింది. ఈ విషయంపై కాబోయే భర్తతో కూడా చెప్పలేదు అని అంది. పెళ్లికి విందు పేరుతో భారీగా ఖర్చు పెట్టే బదులు పేద వాళ్లకి ఆహారం అందిస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. మానసిక సంతోషం కలిగింది అని ఆమె చెప్పింది. ఈ వార్తను చూసిన నెటిజన్లు ఆమెని అభినందిస్తున్నారు.