బైక్ ఎక్కనందుకు ఆ కిరాతకుడు ఆ అమ్మాయి పై ఎంతటి దారుణానికి పాల్పడ్డాడో తెలుసా ..ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలు పడాలి ?

బైక్ ఎక్కనందుకు ఆ కిరాతకుడు ఆ అమ్మాయి పై ఎంతటి దారుణానికి పాల్పడ్డాడో తెలుసా ..ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలు పడాలి ?

by Sunku Sravan

Ads

అమ్మాయిల పై అకృత్యాలు, దాడులు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. చట్టాల్లో ఎన్ని మార్పులు తెస్తున్నప్పటికీ ఎలాంటి మార్పు కనపడడం లేదు. ఇప్పటికే ఆడ వారి రక్షణకోసం ఎన్నో చట్టాలు అందుబాటులో ఉన్నాయి. నడిరోడ్డు పై నడుచుకుంటూ వెళుతున్న ఒక అమ్మాయి తన బైక్ ఎక్కనందుకు అతి కిరాతకంగా కత్తితో దాడి చేసాడు ఆ యువకుడు ఉన్మాది. ఈ సంఘటన గుంటూరు లోని కాకాణి రోడ్డులో జరిగింది.

Video Advertisement

పోలీసులు స్థానికుల కథనం ప్రకారం గుంటూరు కాకాణి రోడ్డులో నడుచుకుంటూ వెళుతున్న ఆ యువతికి బైక్ లో డ్రాప్ చేస్తా అంటూ వెంట పడ్డాడు. చాలా సేపటి వరకు ఆ అమ్మాయిని ఒప్పించే ప్రయత్నం చేసాడు ఇద్దరు కొద్ది సేపు వాగ్వాదానికి కూడా దిగారు, కానీ ఆ అమ్మాయి ఎంతకీ ఒప్పుకోకపోవడం తో ఆ యువకుడు కత్తితో అతి కిరాతకంగా కడుపులో పొడిచి, గొంతు కోసి పరారయ్యాడు.

తీవ్రంగా గాయాలపాలైన ఆ యువతి అక్కడి స్థానికులు హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే ఆ యువతి మరణించినట్టుగా డాక్టర్లు తెలిపారు. మృత దేహాన్ని పరిశీలించిన అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ విచారణ చేపట్టారు దాడి చేసిన యువకుడికి ఈ అమ్మాయికి ఏదైనా సంబంధం ఉందా ? లేక అతను సైకో నా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

పట్టణం లోని ఒక ప్రైవేట్ కళాశాలో బీటెక్ చదువుతున్న ఆ యువతి సెల్ ఫోన్ డేటా ని పరిశీలిస్తే గాని పూర్తి సమాచారం తెలుసుకోలేమంటున్నారు పోలీసులు లాక్ అయ్యి ఉన్న ఆ ఫోన్ విలువైన సమాచారం కచ్చితంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడి చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆ ఉన్మాదిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రేమ వేధింపులే అమ్మాయి పై దాడికి కారణమై ఉంటయాని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.


End of Article

You may also like