Ads
ఇప్పటికే చైనా నుండి కరోనా ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఇప్పుడు చైనాలో ఇంకొక వ్యాధి వెలుగులోకి వచ్చింది. అదే బుబోనిక్ ప్లేగ్. ఈ వ్యాధి ఉత్తర చైనాలో మొదలైంది. అక్కడ నుండి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు వ్యాపించడం మొదలుఅయింది. ఇప్పటికే మంగోలియా లో వ్యాప్తిచెందుతోంది.
Video Advertisement
ఉత్తర చైనాలో జ్వరం, తలనొప్పి, చలి తో బాధపడుతున్న ఒక వ్యక్తి బయన్నూర్‌లోని హాస్పిటల్ లో చేరాడు. డాక్టర్లు అతనికి పరీక్ష చేసి బుబోనిక్ ప్లేగ్ వచ్చిందని నిర్ధారించారు. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకే అవకాశాలు ఉన్నాయి. అందుకనే డాక్టర్లు అతని కుటుంబ సభ్యులని కూడా ఆస్పత్రి లో చేర్పించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో వంద మందికి ఈ వ్యాధి వచ్చినట్లు డాక్టర్లు వెల్లడించారు.
వైరస్ ఇప్పటికే చాలామందికి సోకడంతో ఆ ప్రాంతం మొత్తం లెవెల్ 3 ఆకాంక్షలు జారీచేశారు. ఈ వైరస్ చలి, దగ్గు, జ్వరంతో మొదలవుతుందట. చివరి దశలో శరీరం మొత్తం పుండ్లు ఏర్పడతాయి. దాంతో దగ్గు జ్వరం లాంటి సూచనలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే వచ్చి ఆస్పత్రిలో చేరాలి అని డాక్టర్లు సూచించారు.
చైనా వాళ్ళకి ఎలుకలు తినడం అలవాటు. ఎలుకల్లో ఎర్సీనియా పెస్టిన్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వల్ల ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఎలుకలని తిని ఉంటారు దాంతో వాళ్ళకి బుబోనిక్ ప్లేగ్ వచ్చింది. ఎలుకల్లోనే కాకుండా కొన్ని పురుగుల్లో కూడా ఈ బ్యాక్టీరియా ఉంటుంది. కానీ ఒకవేళ ఎలుకలు తినడం నియంత్రించకపోతే ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అనుమానిస్తున్నారు.
మంగోలియాలోని ఖోవ్డ్ ప్రావిన్స్‌లో పలువురు ఈ వ్యాధితో ఆస్పత్రిలో చేరారు. అందులో ఈ వ్యాధి లక్షణాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరారు. వాళ్ళిద్దరూ ఎలుకలను తిన్నారు. ఇప్పటికే చైనా నుండి కరోనా వైరస్ వచ్చి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఇటీవల జీ ఫోర్ అనే మరో వైరస్ ను కనుగొన్నారు. ఇప్పుడు మొదలైన బుబోనిక్ ప్లేగ్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఒకవేళ ఇది కూడా వ్యాప్తి చెందితే చైనా తో పాటు మిగిలిన దేశాలు కూడా కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు.
End of Article