కేంద్ర బడ్జెట్ ప్రకటన…. మధ్యతరగతి వారికి ఊరట…!

కేంద్ర బడ్జెట్ ప్రకటన…. మధ్యతరగతి వారికి ఊరట…!

by Mounika Singaluri

Ads

ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. మధ్యతరగతి వాళ్ల కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగానే.. బస్తీలు,అద్దె ఇళ్లలో నివాసం ఉండేవారి కోసం సొంత ఇంటి కలను నిజం చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీని కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

Video Advertisement

ఇందులో భాగంగా కొత్త ఇల్లు కట్టుకోవడం లేదంటే కొనుక్కోవడం ఏదైనా సరే సహకారం అందిస్తామని తెలిపారు.జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.

కరోనా సృష్టించిన అవాంతర పరిస్థితుల్లోనూ పీఎం ఆవాస్ యోజన పథకాన్ని కొనసాగించామని.. దీని ద్వారా ఇప్పటికీ 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి దగ్గరగా వెళ్లినట్లు చెప్పారు. క్రమంగా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు.రానున్న ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి కూడా మంత్రి కీలక ప్రకటన చేశారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు కూడా ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపచేస్తున్నట్లు తెలిపారు.అలాగే 9 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న బాలికలు సర్వైకల్ కాన్సర్ బారిన పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.దేశంలో మరికొన్ని మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం కూడా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లక్ పతీ దీదీ టార్గెట్‌ను రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద ఈసారి బడ్జెట్లో మధ్యతరగతి వారికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.


End of Article

You may also like