Ads
గతంలో బుల్లెట్ ను చాలా తక్కువమంది మాత్రమే ఉపయోగించేవారు.కానీ ప్రస్తతం బుల్లెట్ వాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో చిన్న చిన్న పట్టణాలలోను బుల్లెట్ షో రూమ్స్ ఓపెన్ చేస్తున్నారు.అయితే బుల్లెట్ వెళ్ళేటప్పుడు ఎక్కువ బీటింగ్ రావాలని చాలామంది సైలెన్సర్ లో మార్పులు చేస్తూ ఉంటారు.ఇకనుండి అలా చేస్తే మాత్రం పోలీసులు నుండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
బుల్లెట్ యొక్క క్లాసిక్ లుక్ వలన బుల్లెట్ ను అభిమానించేవాళ్ళు చాలామందే ఉన్నారు.అయితే ముఖ్యంగా యువత బైక్ వెళ్ళేటప్పుడు ఎక్కువ బీటింగ్ రావాలని కోరుకుంటారు.దీనికోసం బుల్లెట్ ను తమకు ఇష్టం వచ్చినట్టు సైలెన్సర్ లు మార్పించడం లేదా అదనపు సైలెన్సర్ ను చేర్చడం చేస్తారు.దీంతో బుల్లెట్ ప్రయాణించేటప్పుడు అధిక శబ్దం వస్తుంది.దీంతో కాలుష్యం పెరగడమే కాకుండా ఎంతోమంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది.
అందుకే తిరుపతి పోలీసులు బుల్లెట్ వాహనదారులపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు.బుల్లెట్ వాహనం కనిపిస్తే చాలు వెంటనే ఆపేసి టెస్ట్ చేస్తున్నారు.ఒకవేళ ఏదైనా రి మోడలింగ్ చేసినట్లు తెలిస్తే వాహనాన్ని సీజ్ చేసి బారి రేంజ్ లో ఫైన్ విధిస్తున్నారు.కాగా ఇప్పుడు తిరుపతి లో బుల్లెట్ ల మీద ప్రత్యేక నిఘా పెట్టినతే త్వరలో రాష్ట్రమంతా కూడా ఇదే ధోరణి అవలంబిస్తారని ఇప్పటిదాక అందుతున్న సమాచారం.
End of Article