“ఇదెక్కడి మోసం బూమ్రా మావా.?” అప్పుడు అలా అని… ఇప్పుడు నువ్వే ఇలా చేశావు.?

“ఇదెక్కడి మోసం బూమ్రా మావా.?” అప్పుడు అలా అని… ఇప్పుడు నువ్వే ఇలా చేశావు.?

by Mohana Priya

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక టాపిక్ మాత్రం ట్రెండింగ్ లో ఉంది. అదే క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా పెళ్లి టాపిక్. జస్ప్రీత్ బూమ్రా మార్చి 14వ తేదీన గోవాలో వివాహం చేసుకున్నారు. ఇందుకోసం బూమ్రా మ్యాచ్ నుండి తప్పుకున్నారు. అయితే, బుమ్రా పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు అని చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది.

Video Advertisement

కొంత మంది ఏమో బుమ్రా పెళ్లి చేసుకునేది సినిమాకి సంబంధించిన వాళ్ళని అని అంటే, మరి కొంతమంది ఏమో కాదు అని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం బుమ్రా పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు సంజన గణేశన్ అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సంజన స్టార్ స్పోర్ట్స్ ఇండియాలో టీవీ ప్రెజెంటర్ గా చేస్తారు. అలాగే మిస్ ఇండియా లో కూడా పాల్గొన్నారు.

సంజన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వర్క్ లైఫ్ కి సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. బూమ్రా పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో ఒక విషయం పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ కూడా అవుతోంది. అదేంటంటే 2017లో దివాలి సందర్భంగా బూమ్రా ట్విటర్ లో అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ” సే నో టు క్రాకర్స్” అని క్యాప్షన్ రాశారు.

bumrah diwali tweet

కానీ బుమ్రా వెళ్ళి వేడుకలలో ఒక ఫోటో లో చుట్టూ ఉన్న వాళ్ళు క్రాకర్స్ కాలుస్తున్నారు. “అదేంటి అంతకుముందు అలా ట్వీట్ చేశారు కదా? ఇప్పుడు క్రాకర్స్ ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు?” అని కొంతమంది అంటుంటే. ఇంకొంతమంది మాత్రం, “పండగ వేరే పెళ్లి వేరే కదా” అని అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


End of Article

You may also like