Ads
ధనసరి అనసూయ సీతక్క… ములుగు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం కూడా దక్కించుకుంది. అయితే సీతక్క స్వగ్రామం ములుగు లోని జగ్గన్నపేట గ్రామం. ఈ గ్రామానికి ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. గ్రామానికి వెళ్లేందుకు అనువైన రోడ్లు ఉన్నా కూడా ఆర్టీసీ బస్సు అనేది ఈ గ్రామానికి రాదు.
Video Advertisement
అయితే సీతక్క మంత్రి అయిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ అధికారులు జగ్గన్నపేట గ్రామానికి వెళ్లి రహదారిని రూట్ ను పరిశీలించారు. వరంగల్ డిపో మేనేజర్ మాట్లాడుతూ త్వరలో ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం వస్తుందని తెలియజేశారు.
తెలంగాణలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సీతక్క మంత్రి అయ్యాక తన స్వగ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే ఆ గ్రామ ప్రజలకు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సీతక్క మంత్రి అయిందో లేదో తమ గ్రామానికి వెంటనే ఆర్టీసీ బస్సు రాబోతుంది అంటూ జగ్గన్నపేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పత్తిపల్లి-పొట్లాపూర్ మార్గంలో బస్సు అందుబాటులోకి రానుంది.
End of Article