కరోనా భయంతో కూతురి కోసం ఆ లిక్కర్ వ్యాపారి ఏం చేసారో తెలుసా?

కరోనా భయంతో కూతురి కోసం ఆ లిక్కర్ వ్యాపారి ఏం చేసారో తెలుసా?

by Megha Varna

Ads

కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నో వింతలు విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి.లాక్ డౌన్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఎన్నో కధలు వెలుగులోకి వచ్చాయి.అందులో కొన్ని నవ్విస్తే ,మరొకొన్ని ఘటనలు కళ్ళు చెమర్చేలా చేసాయి.అయితే తాజాగా తన కూతురుని భూపాల్ నుండి ఢిల్లీ పంపించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి అందుకోసం 20 లక్షల రూపాయలు ఖర్చుపెట్టాడు ఓ తండ్రి.కాగా ఈ ఘటన అంతటా చర్చనీయాంశం అయింది..వివరాల్లోకి వెళ్తే …

Video Advertisement

లాక్ డౌన్ కి కొద్ది రోజుల ముందు ఢిల్లీ నుండి భూపాల్ వచ్చి ఇరుక్కుపోయిన కూతురిని తిరిగి ఢిల్లీ పంపించేందుకు 180 మంది ప్రయాణికులు ప్రయాణించే కెపాసిటీ గల ఎయిర్ బస్ 320 విమానాన్ని బుక్ చేసాడు ఓ తండ్రి.సదరు వ్యక్తి భూపాల్ కి చెందిన ప్రముఖ మద్యం వ్యాపారస్తుడిగా తెలుస్తుంది.ఈ మధ్యకాలంలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో రవాణా మార్గాలన్నీ తిరిగి ప్రారంభం అయ్యాయి.అయితే అందరూ ప్రయాణించే ట్రైన్ లో అయినాగానీ లేదా తోటి ప్రయాణికులతో కలిసి విమానంలో ప్రయాణించిన సరే కరోనా సోకుతుంది అని ఆ తండ్రి భయపడ్డారు.

అందుకే అంతా ఖర్చు అయినాసరే స్పెషల్ విమానంలో తన కూతురుని పంపించారు అని తెలుస్తుంది.భూపాల్ నుండి ఢిల్లీ కు ఆ వ్యాపారి కూతురు ,ఇద్దరు మనవరాళ్లు ,ఒక పనిమనిషి కలిసి మొత్తం నలుగురితో ఆ విమానం బయలుదేరింది.ఆ వ్యాపారి గురించి మిగతా వివరాలు సేకరించడానికి మీడియా చానెల్స్ ఎయిర్ పోర్ట్ అధికారులను అడగగా వారు వివరాలను పంచుకోవడానికి నిరాకరించారు.


End of Article

You may also like