Ads
సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఒక సినిమా కథను పోలిన కథతో మరో సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో పాటలు ఒకే లాగా ఉండటం కూడా జరుగుతూ ఉంటాయి.
Video Advertisement
అయితే ఇటీవల వచ్చిన ఒక సూపర్ హిట్ పాట లోని హుక్ స్టెప్ వేరే ఒక పాట లోని స్టెప్ కి దగ్గరగా ఉంది. అల వైకుంఠపురంలో సినిమాలో బుట్ట బొమ్మ పాట ఎన్నో వ్యూస్, లైక్స్ తో యూ ట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. టిక్ టాక్ లో కూడా ఈ పాట చాలా ఫేమస్ అయ్యింది.
కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా నేషనల్ వైడ్ గా, అలాగే ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఈ పాటకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అందులో బుట్ట బొమ్మ హుక్ స్టెప్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ స్టెప్ పాటకే ఒక మెయిన్ హైలెట్.
ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో పాటు, శిల్పా శెట్టి వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ స్టెప్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బుట్ట బొమ్మ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే, 2004 లో విక్రమ్ హీరోగా నటించిన అరుల్ సినిమాలోని ఒక పాటలో ఒక స్టెప్ కొంచెం బుట్ట బొమ్మ స్టెప్ ని పోలినట్లుగా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
watch video :
End of Article