చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఈ పాప ఫోటో చూస్తూ ఉంటె ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తోంది కదా.. మీకు బాగా తెలిసిన అమ్మాయే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మకుటం లేని మహారాణి లా వెలుగొందుతోంది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది.. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..?

kajal agarwal

మన చందమామే. సరిగ్గా చూస్తే మీకు కూడా అనిపిస్తోంది కదా.. “లక్ష్మి కళ్యాణం” సినిమా తో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ చిన్నప్పటి ఫోటో అది. సెలెబ్రిటీల ఫొటోస్ పై కొంచం ఫోకస్ ఎక్కువే ఉంటుంది. వారు ఎప్పుడు ఏ ఫోటో నెట్టింట్లో పోస్ట్ చేసినా అది వైరల్ అవుతూ ఉండడం కామన్. కాజల్ అగర్వాల్ చిన్నప్పటి ఫోటో ఇది.

kajal agarwal 3

ఈ ఫోటో లో కాజల్ చాలా క్యూట్ గా ఉంది కదా.. ఈ ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో దాదాపు అందరు యంగ్ స్టార్ హీరోలతోనూ నటించేసింది. ఇంకా.. తండ్రి కొడుకులు అయిన చిరు, చరణ్ సరసన కూడా నటించిన రికార్డు ను కూడా కొట్టేసింది. ఇటీవలే పదేళ్ల ప్రేమ తరువాత.. తన ప్రియుడు గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది. పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలు చేస్తానని చెప్పడం తో.. ఫాన్స్ కూడా ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.