ఎలెక్షన్స్ లో ఒకేసారి ఒక అభ్యర్థి 2 కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయకూడదా..? దీని గురించి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోంది అంటే..?

ఎలెక్షన్స్ లో ఒకేసారి ఒక అభ్యర్థి 2 కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయకూడదా..? దీని గురించి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోంది అంటే..?

by kavitha

Ads

తెలంగాణ సీఎం కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎలెక్షన్స్ లో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయబోతున్నారు.  ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ గజ్వేల్ మరియు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.

Video Advertisement

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ మొదటి విడత 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన లిస్ట్ ప్రకారం కేసీఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేయడం ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు కన్నా ఎక్కువ నియోజకవర్గాల నుండి పోటీ చేయకూడదా? అనేది ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎలెక్షన్స్ లో రెండు స్థానాల నుండి పోటీ చేస్తున్నారు. ఈ విషయం పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరైనా రెండు స్థానాల నుంచి పోటీ చేసినపుడు  రెండు స్థానాలలో విజయం సాధిస్తే, ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు వదులుకున్న నియోజకవర్గానికి ఎన్నికలు మళ్లీ నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని, ప్రజల ధనం, ఎన్నికల నిర్వహణకు మానవ వనరులు వృథా అవుతాయనే వాదన ఎప్పటినుండో ఉంది.
అయితే, కేసీఆర్ కన్నా ముందు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ వంటి చాలా మంది నాయకులు రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే ఇలా పోటీ చేయవచ్చా ఆనే విషయం పై ఎన్నికల కమిషన్ 2018లో సుప్రీంకోర్టులో వాదన వినిపించింది. సెక్షన్ 33(7)ను సవరించి ఒక అభ్యర్థి ఒక స్థానం నుండి మాత్రమే పోటీ చేసేలా రూల్స్ ను మార్చాలని, అది కుదరకపోతే రెండు స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థి రెండు చోట్ల గెలిస్తే, వారు  వదులుకున్న నియోజకవర్గానికి జరిగే బై ఎలెక్షన్స్ ఖర్చును వారే భరించాలని ప్రతిపాదించింది.
ఇక అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు లక్షలు, లోక్ సభ నియోజకవర్గానికి పది లక్షలు ఖర్చు భరించాలని ఎలెక్షన్ కమిషన్ ప్రతిపాదించింది. సెక్షన్ 33(7) ప్రకారం ఒక అభ్యర్థి రెండు నియోజవర్గాల నుంచి ఒకేసారి పోటీ చేయవచ్చు.  దీనిని 1996లో చట్ట సవరణ ద్వారా కలిపారు. 1996కి ముందు ఎలెక్షన్స్ లో అభ్యర్థులు ఒకేసారి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేసే అవకాశం ఉండేది. ఈ సవరణ తరువాత 2 స్థానాలకు పరిమితం చేశారు.


End of Article

You may also like