తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో జరిగిన ఒక సంఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, సమయం కథనం ప్రకారం తెన్‌కాశి జిల్లాలో కొందరు మాంత్రికులు పుర్రెతో నృత్యాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారంతా నరమాంసం భక్షించారు అని ఆరోపణలు వచ్చాయి. దాంతో పోలీసులు వచ్చి 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

cannibalism in tamilnadu

తెన్‌కాశి జిల్లాలోని కళ్ళురాణి గ్రామంలో కాట్టుకోవిల గుడిలో ఇటీవల ఒక వేడుక జరిగింది. అందులో పాల్గొన్న కొంత మంది కత్తి చివరన ఒక పుర్రెను అమర్చి నృత్యాలు చేస్తూ కనిపించారు. ఈ సంఘటనని కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ గ్రామ పాలనాధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వారు ఎవరి మృతదేహాన్ని భక్షించారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.cannibalism in tamilnadu

 

మృతదేహం ఎప్పుడు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు అనే అంశంపై ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. స్మశానంలో సగం కాలిన శవాన్ని తీసుకు వచ్చారు ఏమో అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. 2019 లో కూడా ఇదే గ్రామంలో కొంత మంది మనిషి పుర్రెను తీసుకువచ్చి ఇలాగే ప్రదర్శనలు చేశారు అని అని తెలుస్తోంది .