బ్రేకింగ్ న్యూస్: హైదరాబాద్ లో మొదటి కరోనా కేసు..! జాగ్రత్తగా ఉండండి..!

బ్రేకింగ్ న్యూస్: హైదరాబాద్ లో మొదటి కరోనా కేసు..! జాగ్రత్తగా ఉండండి..!

by Sainath Gopi

Ads

చైనాలో కొన్ని వేలమందిని వణికిస్తున్న వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని వణికిస్తుంది. చైనా నుండి పాకి అనేక దేశాలకు చేరుకుంది. మన భారత్ లో కూడా కేరళ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొత్తగా నాలుగు నగరాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి అనుమతించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్‌తోపాటు అలిప్పీ(కేరళ), ముంబయి, బెంగళూర్లను చేర్చింది.

Video Advertisement

కరోనా వైరస్ హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. మన దేశంలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తెలిపింది. అంతేకాదు ఢిల్లీలో మరో వ్యక్తికి కూడా కరోనావైరస్ వచ్చిందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది. ప్రస్తుతం వారిద్దరికి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స కొనసాగిస్తున్నారు.

అలాగే మనం కూడా జాగ్రత్తలు పాటిద్దాం. ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు. ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి. చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి .జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా చాలా రోజులనుండి ఉంటె వెంటనే డాక్టర్ ని కలవండి.


End of Article

You may also like