Ads
తెలుగు సీరియల్ నటుడు సమీర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సమీర్ కోయిలమ్మ సీరియల్ లో హీరోగా నటించారు. వివరాల్లోకి వెళితే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం నటుడు సమీర్ తాగిన మత్తులో ఇద్దరు మహిళలపై గొడవకు దిగారు. సమీర్ తో పాటు మరో నలుగురు ఉన్నారు.
Video Advertisement
శ్రీ విద్య, స్వాతి, లక్ష్మి అనే ముగ్గురు మహిళలు మణికొండలో బోటిక్ నిర్వహించేవారు. కొన్ని కారణాల వల్ల స్వాతి వ్యాపారం నుండి తప్పుకున్నారు. స్వాతి తనకి అందాల్సిన కొన్ని వస్తువులు తిరిగి ఇవ్వని కారణంగా జనవరి 27 వ తేదీ అంటే మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో సమీర్ తో కలిసి శ్రీ విద్య ఇంటికి వెళ్లారు.
image source : ABN Andhra Jyothi
అక్కడ మాటకి మాట పెరగడంతో గొడవ మొదలైంది. దాంతో శ్రీ విద్య, లక్ష్మీ పై సమీర్ దాడికి దిగారు. దాంతో ఇరువర్గాల సభ్యులు ఒకరిపై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహిళలు ఇద్దరు, సమీర్ ఐదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని మళ్ళీ తిరిగి అడిగినప్పుడు రౌడీయిజం చేస్తున్నాడు అని, సమీర్ నుంచి వారికి ప్రాణహాని ఉందని వారి ఫిర్యాదులో పేర్కొన్నారు. సమీర్ తాను ఇచ్చిన ఫిర్యాదులో వేరేగా పేర్కొన్నారు.
watch video :
https://www.youtube.com/watch?v=n13e0wmsYdA&authuser=0
End of Article