Home serials “క్యాష్” షోలో రొమాంటిక్ సీన్…నోట్లో పెట్టేసుకొని లాగేసుకున్నారు.! దెబ్బకి యాంకర్ సుమ షాక్.!

“క్యాష్” షోలో రొమాంటిక్ సీన్…నోట్లో పెట్టేసుకొని లాగేసుకున్నారు.! దెబ్బకి యాంకర్ సుమ షాక్.!

by Mohana Priya

ప్రతి శనివారం నాడు ఈ టీవీలో ప్రసారం అయ్యే ప్రోగ్రాం క్యాష్. ఈ ప్రోగ్రాం ఎన్నో సంవత్సరాల నుండి ప్రేక్షకులను అలరిస్తోంది. క్యాష్ ప్రోగ్రాం కి టిఆర్పి లు కూడా బాగానే ఉంటాయి. ఈ ప్రోగ్రాంకి సుమ యాంకర్ గా బాధ్యతలు నిర్వహిస్తారు అని మనందరికీ తెలిసిందే.

cash program arjun surekha promo going viral

క్యాష్ ప్రోగ్రామ్ కి ఇప్పటి వరకు సినిమా రంగానికి చెందిన వాళ్లు, సీరియల్ రంగానికి చెందిన వాళ్ళు, యాంకరింగ్ రంగానికి చెందిన వాళ్ళు ఇలా ఎంతో మంది ప్రముఖులు గెస్ట్ లుగా వచ్చారు. వారిలో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రోగ్రాంకి వచ్చారు. అయితే వచ్చే వారం క్యాష్ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు.

cash program arjun surekha promo going viral

ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే శనివారం క్యాష్ ప్రోగ్రాంలో రియల్ లైఫ్ కపుల్ సీరియల్ యాక్టర్ అర్జున్, తన భార్య సురేఖ, అలాగే రీల్ లైఫ్ కపుల్ రవి కృష్ణ, నవ్య స్వామి గెస్ట్ లుగా రాబోతున్నారు. అయితే ఈ క్యాష్ ప్రోమోలో సురేఖ గులాబీ పువ్వుని నోటితో పట్టుకున్నారు. దానిని అర్జున్ నోటితో తీసుకున్నారు.

cash program arjun surekha promo going viral

సుమ కూడా ఆశ్చర్యపోయినట్టు మనకి ప్రోమోలో చూపించారు. దాంతో “మామూలుగా టీవీ చానెల్స్ లో వచ్చే ప్రోగ్రామ్స్ లో ఇలాంటి కంటెంట్ ఎప్పుడూ ఉండదు. కానీ ఇప్పుడు ఎందుకు కొత్తగా వస్తోంది?” అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. క్యాష్ ప్రోగ్రాంకి సంబంధించిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

You may also like