Ads
పిల్లులు అందరకి ఇష్టమైన పెంపుడు జంతువులు కాదు ..ఎందుకంటే అవి కుక్కలు లాగా మనుషులను అంతగా పట్టించుకోవు అని ..కానీ ఒక పిల్లి చూపిన మాతృ ప్రేమతో అసలు మనుషులైన ,జంతువులైన తల్లి హృదయం ఎప్పుడు ఇంతే కదా అని అనిపించేలా చేసిన ఘటన ఇది ..తాజాగా ఇస్తాంబుల్ ఆసుపత్రి అత్యవసర గదిలో తీసిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి ..ఒక పిల్లి తన జబ్బుపడిన పిల్లను ఆసుపత్రికి తీసుకువచ్చింది.దీనికి సంబందించిన వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది ..వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
అక్కడ ఉండే టర్కిష్ ప్రజలు జంతువులపై ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు.వారు ఆ పిల్లి పిల్ల కు అవసరమైన వైద్యం వెంటనే అందించారు.ఇప్పుడు ఆ పిల్లి బాగానే ఉంది .మొదట టర్కిష్ మీడియా లో ఈ వార్త విస్తృతంగా ప్రచారం అయింది.తర్వాత ట్విట్టర్ లో పిల్లి ఆసుపత్రి గదికి తీసుకువెళ్లే ఫొటోస్ ను షేర్ చేసి ‘ఈ రోజు మేము ఆసుపత్రి యొక్క అత్యవసర గదిలో ఉన్నాము ,ఒక పిల్లి తన పిల్లను నోటితో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది ‘అని మెర్వ్ యోజాక్ అనే వ్యక్తి పోస్ట్ చేసాడు ..ఈ పిల్లి మాతృ ప్రేమ ఎంతో మంది హృదయాలను కదిలించి వేసింది ..
మొదటగా పిల్లి పిల్లకు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించాము కానీ మేము వైద్యం చేస్తునంతసేపు ఆ పిల్లి తల్లి మా చుట్టూనే తిరుగుతూ ఉంది అని అక్కడ వైద్య బృందం తెలిపారు..ఆ సమయంలో ఆ తల్లి పిల్లికి మంచి సౌకర్యం కల్పించి పాలు కూడా అందచేశారు అక్కడి డాక్టర్లు .తర్వాత తల్లి పిల్లిని కూడా పరీక్షించగా తల్లి పిల్లి కూడా ఆరోగ్యంగానే ఉందని తెలిపారు ..
ఆ ఆసుపత్రి డాక్టర్లను ,సిబ్బంది చాలా దయగల వారని మంచి చర్యలు వెంటనే తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఏ జంతువులైన మనుషులైన తల్లి ప్రేమ మాత్రం తల్లి ప్రేమే ,తల్లికి మించి ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు అంటూ పలువురు నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు …..
End of Article