స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ రోజురోజుకి ఆసక్తిని పెంచే విధంగా నడుస్తుంది. ప్రతి ఎపిసోడ్ ఒక్కో ట్విస్టుతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో రేవతి భవాని దుమ్ము దులిపేసింది…. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే….!
రేవతి వాళ్ళందరూ కృష్ణ ఇంటికి వెళ్లారని చెప్పి వాళ్ళ మీద ముకుంద వాళ్ళందరి మీద నెగిటివ్ గా భావానికి చెబుతుంది. వాళ్ళు నావైపు చాలా నీచంగా చూస్తున్నారు. నేనేదో కాని పని చేస్తునట్టు చూస్తున్నారు. తట్టుకోలేకపోతున్నా అంటుంది.

ఈ కేసులు అసలు దోషులని పట్టుకోవడం ఇవేవీ నాకు అవసరం లేదత్తయ్య. నాకు కావలసింది మురారితో జీవితం పంచుకోవడమేనని ఎమోషనల్ గా అంటుంది. నాకు ఈ ఒక్కసాయం చేయండి జీవితాంతం మీ కాళ్ళ దగ్గరపడి సేవ చేసుకుంటానని భవానీ కాళ్ళు పట్టుకుంటుంది. నేను ఉన్నాను కదా ఎందుకు అంత భయమని భవానీ ముకుంద తో అంటుంది. మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఉన్నాను లేదంటే ఎప్పుడో చచ్చిపోయే దాన్నని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.

కృష్ణ ఇంట్లో అందరూ టిఫిన్ చేసేందుకు కూర్చుంటాడు. కృష్ణ కోసం మురారి వంట చేస్తాడు. గన్ పట్టుకునే వాడి చేత గరిట పట్టిస్తావా అంటూ అందరూ ఆట పట్టిస్తారు. మురారిని కూడా టిఫిన్ తినడానికి కూర్చోమంటే తర్వాత తింటానని చెప్తాడు. అంతేలే మా తొట్టి గ్యాంగ్ వెళ్లిపోయాక ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటూ టిఫిన్ తింటారా అంటూ మధుకర్ కాసేపు వాళ్ళని ఆట పట్టిస్తాడు. అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఉండగా ఒక్కసారిగా భవానీ వచ్చి స్టాపిడ్ అని గట్టిగా అరుస్తుంది.

ఏంటి ఇదంతా రేవతి అని సీరియస్ గా అడుగుతుంది భవాని. ఈ నవ్వులు ఏంటి? ఎందుకు ఇంత ఆనందమని అడుగుతుంది. ఏమైందని ఇంతగా రియాక్ట్ అవుతున్నారని రేవతి భవనింతో అంటుంది. మనతో పాటు మన ఇంట్లో తన జీవితం ఏమైపోతుందోనని తెలియని భయంతో తన ప్రాణాలు కూడా తీసుకోవడానికి సిద్ధపడిన వ్యక్తి ఉందని తెలుసా మీకు? లేకపోతే మీరందరూ తనని చంపేయాలని అనుకుంటున్నారా? అని నిలదీస్తుంది. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మురారి అంటాడు. అయినా మనకి ఇల్లు లేనట్టు ఇలా ఇళ్ళలో పడి తినడం ఏంటని భవానీ చీదరింపుగా మాట్లాడుతుంది. కృష్ణ మాట్లాడబోతుంటే నోరు మూయిస్తుంది.

అసలు దోషులు ఎవరో పట్టుకునే వరకు భార్యాభర్తలుగా ఉండమని మీరేగా చెప్పింది,మళ్ళీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటని ప్రశ్నిస్తుంది. ఒక్కసారి తాను చెప్పేది వినమని అంటుంది. పెద్దమ్మ నేను ఈ కేసు గాలికి వదిలేయడం జరిగితే ముకుందతో నా పెళ్లి జరుగుతుంది కదా. మరి నేను ఈ కేసు వదిలితే రిలాక్స్ గా ఉండాలసింది పోయి ఎందుకు ఇంత ఇరిటేట్ అవుతున్నారని అని మురారి అడుగుతాడు. నువ్వు అర్థం చేసుకుంది ఇదే మురారి. కానీ ఈ కేసు ఫైనల్ హియరింగ్ వచ్చేసరికి వీళ్ళే నేరం చేశారని తొందరగా అర్థం అయితే అంత మంచిదని నేను తొందరపడుతున్నానని భవాని చెప్తుంది.





రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సలార్ రిలీజ్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఈ మూవీలో జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, బాబీ సింహా, దేవరాజ్ వంటివారు నటించారు.
బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ కి హిట్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీ చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ విశ్వరూపాన్ని చూపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించాడని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో కూడా యాక్షన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. హీరో ప్రభాస్ ఒక సన్నివేశంలో ఇనుప కడ్డీ పట్టుకుంటే, ఆ రాడ్ పైన ఫింగర్స్ ప్రింట్ పడుతాయి. మరో సన్నివేశంలో ఒక గుద్దు గుద్దితే షాక్ కొట్టిన వాడు బ్రతుకుతడం ఏంటని, కరెంట్ వైర్ సీన్ అవసరమా అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.





