ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా, మిస్టర్ నూకయ్య డైరెక్టర్ అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘హిడింబ’. ఈ మూవీని గంగపట్నం శ్రీధర్ నిర్మించగా, నిర్మాత అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై సమర్పించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నందిత శ్వేత నటించింది.
ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 20న రిలీజ్ అయ్యి, యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అశ్విన్, నందిత శ్వేతలు పోలీస్ ఆఫీసర్లుగా నటించిన ఈ మూవీ తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కొత్త తరహ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, హైదరాబాద్‌లో అమ్మాయిలు వరుగా అపహరణకు గురవుతుంటారు. సుమారు 16 మంది కనిపించకపోవడంతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం కేరళ నుండి ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా)ను సిటీకి రప్పిస్తారు. అప్పటికే ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసు ఆఫీసర్ అభయ్ (అశ్విన్ బాబు) తో పాటు ఆద్య కూడా విచారణ మొదలుపెడుతుంది.
తప్పిపోయిన అమ్మాయిలకు ఏమైంది? అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో నివసించే గిరిజన తెగ హిడింబాలకు ఉన్న సంబంధం ఏంటి? ఆద్య, అభయ్ ఈ కేసును చేధించారా? అనేదే మిగతా కథ. ఎంచుకున్న కథ ఎంత గొప్పది అయినా, ఎంత క్రియేటివ్‌గా చూపించినా ఆడియెన్స్ కి అర్థం కాకపోతే ఆ మూవీతో కనెక్ట్ కాలేరు. ఈ మూవీలో అదే జరిగింది.
నిజానికి ఈ మూవీ కాన్సెప్ట్ కొత్తది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపిస్తూ, వర్తమానంలో జరిగే సీన్స్ చూపించడంతో స్టోరీ ఎక్కడ నడుస్తుందో అర్థం కాకపోవడం ఆడియెన్స్ ను గందరగోళానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశం సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ ను పెంచుతుంది.
అసలు స్టోరీ సెకండాఫ్‌లో చూపించారు. హిడింబ తెగ నేపథ్యం, హైదరాబాద్ లో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు కనెక్షన్ ఉండడం, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేస్తుంది. అయితే డైరెక్టర్ పలు చోట్ల సినిమాటిక్ లిబర్టీ ఉపయోగించుకున్నాడు. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది.
Also Read: OMG 2 REVIEW : ఈ “అక్షయ్ కుమార్” సినిమా అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఇష్టపడని ఆడియెన్స్ ఉండరు. ముఖ్యంగా మెగా అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఈరోజు (ఆగస్టు 11) థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్ వేదళం మూవీకి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో చిరంజీవి, కీర్తి సురేష్ అన్నాచెల్లెళ్ళుగా నటించారనే విషయం తెలిసిందే.
భోళా శంకర్ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియచేస్తున్నారు. కొందరు సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని, మెగాస్టార్ చిరంజీవి లుక్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ సన్నివేశాలు పర్వాలేదని చెబుతున్నారు. ఇంటర్వెల్ బాంగ్ తో ప్రధమార్ధం పర్వాలేదని అంటున్నారు
అయితే ఈ చిత్రంలో చిరంజీవి, హీరోయిన్ తమన్నా మధ్యలో పెట్టిన లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని, అలాగే ఖుషి నడుము సీన్ కూడా అంతగా సెట్ అవలేదని, భోళా శంకర్ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు పెట్టడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఈ మూవీకి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో కలెక్షన్ రావడం లేదని సమాచారం. ఎందుకంటే ఓవర్సీస్లో అతి తక్కువ ఏరియాలలోనే ఈ మూవీ రిలీజ్ చేశారు. ప్రధానంగా యూఎస్‌లో 309 లొకేషన్లలో ఈ మూవీ ప్రీమియర్ షోలను వేశారు. దాంతో 308K డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో 2.54 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో రీఎంట్రీ ఇచ్చిన తరువాత నటించిన సినిమాలు ప్రీమియర్స్ ద్వారా ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్ సాధించాయి. వాటితో పోలిస్తే ‘భోళా శంకర్’ సినిమా తక్కువ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు. ఈ క్రమంలోనే హీరో బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ ప్రీమియర్ వసూళ్లతో ‘భోళా శంకర్’ కలెక్షన్స్ పొలుస్తున్నారు. ప్రీమియర్స్ ద్వారా బాలయ్య సినిమా 708k డాలర్లను కలెక్ట్ చేసిందని, చిరంజీవి మూవీ దానిలో సగం కూడా వసూల్ చేయలేదని అంటున్నారు.
#1 జీ 5




గతంలో మెహర్ రమేష్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తీసినప్పటికీ, అవి హిట్ అందుకోలేకపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో మంచి కమ్ బ్యాక్ కావాలని భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే షోలు పడడంతో మూవీ చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
భోళా శంకర్ సినిమాను చూసినవారు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఈ మూవీ లోని సీన్స్ కు సంబంధించిన ఫోటోలతో కూడిన మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సామాజిక మధ్యమాలలో ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.








భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జైలర్ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో రజనీకాంత్ భార్య పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించింది. ఈ మూవీలో కీలకమైన రజిని కాంత్ కొడుకు అర్జున్ పాత్రలో తమిళ హీరో వసంత్ రవి నటించారు. ఈ చిత్రం వసంత్ నటించిన నాలుగవ చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీ అశ్విన్స్ లో హీరోగా వసంత్ రవి నటించారు.
వసంత్ రవి అసలు పేరు వసంత్ కుమార్ రవి. ఇతను హీరో మాత్రమే కాదు డాక్టర్ కూడా. చెన్నై లో ఫేమస్ రెస్టారెంట్ అయిన ‘నమ్మ వీడు వసంత భవన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్’ చైర్మన్ రవి ముత్తుకృష్ణన్ కుమారుడు వసంత్ రవి. 2017లో మొదటిసారి అతను ‘తారామణి’ అనే చిత్రంలో నటించాడు.
ఆ మూవీ హిట్ అయ్యింది. ఆ మూవీలోని నటనకు గాను వసంత్ ఉత్తమ నటుడుగా విజయ్ అవార్డ్ మరియు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ను అందుకున్నాడు. అతను నటించిన రెండవ సినిమా ‘రాకీ’ ఈ మూవీకి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత హర్రర్ మూవీ ‘అశ్విన్స్’ లో హీరోగా నటించిన వసంత్ ‘జైలర్’ మూవీలో అర్జున్ అనే ఏసీపీ పాత్రలో మెప్పించారు.







మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ మూవీలో మహేష్ నటన, డైలాగ్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా, సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘కళావతి’ పాట అయితే ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు.
ఈ పాటకు చాలా మంది సెలెబ్రిటీలు కూడా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ మూవీలో మహేష్ బాబు బ్యాంక్ గురించి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అయితే ఈ డైలాగ్ ను గతంలో వచ్చిన ఒక మూవీలో వేరే హీరో చెప్పడం విశేషం. ఆ హీరో చెప్పిన డైలాగ్ కు సంబంధించిన వీడియోను ట్రోల్ ప్లాజా అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.
ఆ డైలాగ్ చెప్పిన హీరో శ్రీకాంత్, నిన్నే ప్రేమిస్తా మూవీలో బ్యాంక్ మేనేజర్ పాత్రలో శ్రీకాంత్ నటించారు. అక్కడి ప్రజలకి “డబ్బు అంటే లక్ష్మీ, ఆ లక్ష్మీ కొలువై ఉండేది బ్యాంక్ లో కదా! ఆ బ్యాంక్ గుడి లాంటిది. అంటే ఎంత పవిత్రంగా చూసుకోవాలి” అని చెప్తారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
గత కొంతకాలం నుండి ‘గుంటూరు కారం’ సినిమా గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. హీరోయిన్ పూజా హెగ్డే ఈ మూవీ నుండి తప్పుకుందని, ఆమె స్థానంలో శ్రీలీలను, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షీ చౌదరిని తీసుకున్నట్టు టాక్. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తొలగించారని, ఆ తరువాత సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై చిత్ర యూనిట్ స్పందిస్తే తప్ప ఈ వార్తలు నిజమో, కాదో తెలియదు.
మరో వైపు త్రివిక్రమ్ పై విమర్శలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం మూవీని పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ సినిమాల కోసం పని చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ బ్రో మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఇలా చేయడం వెనుక ఉన్న అసలు నిజం ఇదే అంటూ ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ లో “మహేష్ ఫ్యామిలీ ఫ్రెండ్ నా క్లాస్ మేట్. తను చెపుతుంది, పవన్ మీద ఉన్న అభిమానంతో, పవన్ కి పరోక్షంగా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రంకి బ్రో మీద టైం స్పెండ్ చెయ్యడానికి మహేష్ అనుమతి ఇచ్చాడంట. మహేష్-పవన్ మధ్య ఉన్న బంధం ఎప్పటికీ బలంగానే ఉంది” అంటూ రాసుకొచ్చారు.