గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.. సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో అసలు సినిమా కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కథ:
విజయనగరం అనే ఒక గ్రామానికి చెందిన కోదండపాణి అలియాస్ వీ రవిచంద్రన్ గర్భవతైన భార్యతో పాటు ఊరు విడిచి వెళతాడు. అయితే బస్సులోనే భార్య ప్రసవించి మృతి చెందడంతో, ఆ బిడ్డను కోదండపాణి ఒక్కడే పెంచుకుంటాడు. ఆ పిల్లవాడే అభి అలియాస్ కిరీటి రెడ్డి. చిన్నప్పటి నుంచే తండ్రి ప్రేమను ఒత్తిడిగా భావించిన అభి, స్వేచ్చ కోసం సిటీకి వెళ్లి కాలేజీలో జాయిన్ అవుతాడు అక్కడే స్ఫూర్తి అలియాస్ శ్రీలీలని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. చివరికి ఆమె పని చేసే కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. ఆ కంపెనీలో సీఈఓగా ఉండే విజయ సౌజన్య అలియాస్ జెనీలియాకి అభి అంటే మొదటి నుంచి నచ్చదు. కానీ ఒక సందర్భంలో ఇద్దరూ కలిసి విజయనగరానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఊరితో విజయకి ఉన్న అనుబంధం ఏమిటి? అభి, విజయ మధ్య ఉన్న లింక్ ఏంటి? అనేవి తెలియాలంటే ఈ సినిమా కథ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్త ఏమి కాదు అని చెప్పాలి. ప్రేక్షకులకు ఈ కథ తెలిసినదిగా అనిపించినప్పటికీ కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ఈ విషయంలో డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పాలి. మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం కిరీటి స్టైల్, ఎనర్జీ, డ్యాన్స్ లతో నిండిపోయింది. వైరల్ అయిన వయ్యారి పాట మొదలుకుని, ఫన్నీ గ్యాంగ్ ఎంట్రీలు, లవ్ ట్రాక్ లు ఫస్ట్ హాఫ్‌కి బలం అయ్యాయి అని చెప్పవచ్చు. తర్వాత జెనీలియా ఎంట్రీతో కథ కాస్త మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి మధ్య ఉన్న బంధం, ఎమోషనల్ ట్విస్టులు సినిమాకి బలంగా మారాయి. క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందని చెప్పవచ్చు.
నటీనటుల పనితీరు :
కిరీటీ తన టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్తో మెప్పించాడు. మరీ ముఖ్యంగా డ్యాన్స్ లు మాత్రం ఇరగదీసేశాడని చెప్పాలి. మొదటి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే నటనపరంగా కూడా మంచి మార్కులే కొట్టేశాడు హీరో కిరీటిరెడ్డి. అదేవిధంగా ఫైట్లు, సన్నివేశాలలో కూడా అద్భుతంగా చేశారు. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. మొత్తానికి మొదటి సినిమాతోనే హీరో కిరీటీ మంచి మార్కులు కొట్టేశాడు. శ్రీలీల రోల్ కి మంచి మార్కులే పడ్డాయి. జెనీలియాకు మాత్రం టెర్రిఫిక్ రోల్ పడింది. ఆమె రోల్ సినిమాకి చాలా కీలకం. కార్పొరేట్ లుక్‌తో, ఓ మెచ్యూర్డ్ క్యారెక్టర్లో సూపర్‌గా నటించింది జెనీలియా. మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
సాంకేతికత:
డెవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి అసలైన హైలైట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. కాగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎమోషనల్ సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా, గ్రాండ్ గా కనిపించింది. ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్ పరంగా కూడా పనితనం కూడా బాగుంది. కెమెరా వర్క్స్ కూడా బాగున్నాయి. మ్యూజిక్ కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని చెప్పాలి.
రేటింగ్: 3.5/5
News
థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న వైభవ్ హీరోగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1
టాలెంటెడ్ హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 ఈరోజు (జూన్ 13) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు షెరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ. రాజశేఖర్ & సాయి కిరణ్ బత్తుల నిర్మించారు. టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని నెలకొల్పి, సినిమాపై బజ్‌ను పెంచాయి.
ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించగా, సినిమాటోగ్రఫీని బాలాజీ కె రాజా చేపట్టారు. సస్పెన్స్, థ్రిల్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని అందిస్తోంది. హంటర్ చాప్టర్ 1 నేటి నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.మొదటిరోజు ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది.
వైభవంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్
– ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ – భారతదేశపు మొట్టమొదటి రియల్ టైమ్ పబ్లిక్ ఇంటిలిజెన్స్ వెబ్ సైట్, యాప్
– ‘పారావీల్’ యాప్ లో ఏపీలోని 175 నియోజకవర్గాల సమగ్ర సమాచారం
– గ్రామ, బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ సమస్యలను తెలుసుకునే అవకాశం
– రాజకీయాల్లో ఉన్నవారికి, రావాలనుకునే వారికి ఉపయోగకరం
– ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 19 మందిపై 30శాతం ప్రజా వ్యతిరేకత
– త్వరలో ఇతర రాష్ట్రాల్లోనూ పారావీల్ వెబ్ సైట్, యాప్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో గెలుస్తుందని ఆక్యురేట్ గా పర్పెక్ట్ సర్వే ఇచ్చిన కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ పారావీల్ అనే యాప్ ను తయారుచేసింది. భారతదేశపు తొలి రియల్ టైమ్ పబ్లిక్ ఇంటెలిజెన్స్ యాప్ గా పారావీల్ ను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రజల ముందుకు తీసుకొస్తోంది కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ. పారావీల్ యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్ హైదరాబాద్ వెస్టిన్ హోటల్లో ఘనంగా జరిగింది. యాంకర్ సుమతో కలిసి ఈ యాప్ ను కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అధినేత కిరణ్ కొండేటి లాంఛ్ చేశారు.
ఈ సందర్భంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అధినేత కిరణ్ కొండేటి మాట్లాడుతూ – జూన్ 4వ తేదీ మా సంస్థకు ప్రత్యేకమైన రోజు. గతేడాది ఇదే రోజున ఏపీ ప్రజలు మా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ గురించి మాట్లాడుకున్నారు. కూటమి గెలుస్తుందని మేము ఇచ్చిన సర్వే ఆక్యూరేట్ గా నిజమైంది. ప్రజల నాడిని మా సర్వే ద్వారా వెల్లడించాం. అంతేగానీ మేము ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడం లేదు వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు మా సంస్థ నుంచి పారావీల్ వెబ్ సైట్, యాప్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ఇది భారతదేశపు ఫస్ట్ రియల్ టైమ్ పబ్లిక్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్. ఏపీలో మొదట ప్రారంభిస్తున్నాం. ఈ నెల 12 నుంచి మా వెబ్ సైట్, యాప్ అందుబాటులోకి వస్తుంది. క్రమంగా ఇతర రాష్ట్రాల్లో కూడా మా ప్లాట్ ఫామ్స్ ప్రారంభిస్తాం. రాజకీయాల్లో ఉన్న వారికి రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటి అనేది తెలుసుకునేందుకు మా పారావీల్ వెబ్ సైట్, యాప్ ఉపయోగపడుతుంది. ఒక్కో నియోజకవర్గంపై 36 అంశాలతో 100 పేజీలకు తగ్గకుండా సమగ్ర సమాచారాన్ని పొందుపరిచాం. ఇందులో విద్యా, వైద్యం, మేల్, ఫీమేల్, కులాల మధ్య సమస్యలు…లాంటి అన్ని అంశాలుంటాయి. ఒక్కో నియోజకవర్గంలో ఉండే జనాభాతో పాటు, మండలాలు, గ్రామాలు, బూత్ స్థాయి లో ప్రతి అంశాన్ని ప్రస్తావించడంతోపాటు అక్కడ ఉన్న సమస్యలను సైతం అప్లికేషన్ లో తెలుసుకోవచ్చు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు వారికి ఏం సమస్యలు ఉన్నాయి అనే సమాచారం కూడా ఉంటుంది.
ప్రస్తుతం మేము తీసుకున్న డాటా ప్రకారం 19 ఎమ్మెల్యేలపై 30 శాతం వ్యతిరేకత ఏర్పడింది. కూటమి నేత ఎవరు కావాలని కూటమి సపోర్టర్స్ ను అడిగితే ఆశ్చర్యపరిచేలా 7శాతం మంది ఎన్టీఆర్ పేరు చెప్పారు. అలాగే కూటమి నేత ఎవరు కావాలని వైసీపీ సపోర్టర్స్ ను అడిగితే ఎన్టీఆర్ కావాలంటూ 21శాతం మంది చెప్పారు. ఏపీ ప్రారంభమయ్యే మా వెబ్ సైట్, యాప్..త్వరలో ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తాం. గ్రామ సర్పంచ్ నుంచి దేశ ప్రధానమంత్రి వరకు ఎవరికైనా డాటా ముఖ్యం. తమ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో డాటాతో సహా తెలుసుకుంటేనే అక్కడ ఆ సమస్యలు పరిష్కరించి విజయం సాధించవచ్చు. పారావీల్ ద్వారా ఆ సమస్యలను తెలియజేస్తాం. మీరు గెలవాలనుకుంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలి. కొత్తగా ఎమ్మెల్యే కావాలనుకునేవారు కూడా నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలి. అన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ప్రవీణ్, సాయి, తిరుమలేష్, గంగాధర్, యోగేశ్వర్ రెడ్డి, సాంబశివ, సుశాంత్ పాల్గొన్నారు.
ఆహాలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్లాక్‌బస్టర్ “ఒక యముడి ప్రేమకథ” స్ట్రీమింగ్
సీతారామం, కల్కి, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ ఒక స్ట్రైట్ తెలుగు హీరోగా ఇక్కడ ఇంత ఫ్యాన్స్ బేస్ నెలకొల్పుకున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అభిమానంతో పాటు బాక్స్ ఆఫీస్ విజయాలతో, ప్రస్తుతం ఆయన నటిస్తున్న తెలుగు చిత్రాలు ఒక్కొక్కటీ రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించబడుతున్నాయి. ఈ విధంగా ఆయన టాలీవుడ్ టాప్ హీరోల సరసన నిలిచారు.
ప్రస్తుతం దుల్కర్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మిస్తున్న “కాంతా”, స్వప్న సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న “ఆకాశంలో ఒక తారా” అనే రెండు తెలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఆయనకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, నటనలోని నైపుణ్యం భారతదేశంలోని అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు AHA దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అభిమానుల మన్ననలు పొందిన “ఒరు యమండన్ ప్రేమకథ” చిత్రం, “ఒక యముడి ప్రేమకథ” పేరుతో AHAలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో భవాని మీడియా విడుదల చేయనుంది.
దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న ప్రయాణంలో ఇది మరొక మైలురాయి. అలాగే తెలుగు ప్రేక్షకులకు క్యాలిటీ, డిఫరెంట్ కంటెంట్ అందించాలన్న AHA సంకల్పానికి ఇది అద్దం పడుతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు విడుదలైన సినిమాలకు ప్రతిష్ఠాత్మక గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ఒక్కో ఏడాదికిగానూ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాల్ని పురస్కారాలకు ఎంపిక చేసింది. 2014 గాను సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా ‘పాఠశాల’ చిత్రం ఎంపికైయింది.
రాకేశ్ మహాంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మాణంలో మాహి వి రాఘవ దర్శకత్వం వహించిన ‘పాఠశాల’ ఐదుగురు మిత్రులు, ఐదు వారాలపాటు, 5000 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ, యువత, స్నేహం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అందంగా చూపించే ఒక అద్భుతమైన కథ. మనసుల్ని తాకిన గొప్ప కథనం, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన విజువల్స్ మేళవింపుతో ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుండి విశేషంగా ఆదరణ పొందింది. ఇప్పుడు 2014 గాను సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా ప్రతిష్ఠాత్మక గద్దర్ సినీ అవార్డ్ కు ఎన్నికయ్యింది.
ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారాల్లో 2014 గాను సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా పాఠశాల చిత్రం ఎంపికకావడం పట్ల చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ‘పాఠశాల’ చిత్రం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2014లో రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గుర్తింపు మా చిత్రానికి ఉన్న శాశ్వతమైన ప్రభావాన్ని, విలువలను మరింత బలపరుస్తోంది’అన్నారు.
* బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడి ఓడిన వేదవల్లి…
* కుటుంబానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేయూత
హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచుకున్న పాప ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళితే బ్లడ్ క్యాన్సర్ అని పరీక్షల్లో తేలింది. పాపను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు రూ.లక్షలు వెచ్చించారు. విషయం ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారి దృష్టికి రావడంతో పాప చికిత్సకు రూ. 8 లక్షలు మంజూరు చేశారు. వ్యాధి ముదరడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఆమె చికిత్సకు గతంలో చేసిన వ్యయానికి సంబంధించి మరో రూ.7 లక్షలను సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేయాలని సీఎం శ్రీరేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ఆ మొత్తాన్ని విడుదల చేశారు… వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన రఘు, మంజుల దంపతులు. రఘు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. రఘు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె వేదవల్లికి (5) 2022లో తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు బ్లడ్ క్యాన్సర్ (అనాప్లాస్టిక్ లార్జ్ సెల్ లార్జ్ లింఫోమా) అని తేల్చారు. పాపను రక్షించుకునేందుకు రెండేళ్ల పాటు తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల చుట్టూ తిప్పారు.
చికిత్స వ్యయం నానాటికీ భారమవడంతో 2024లో ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వేదవల్లి చికిత్సకు అవసరమైన రూ.8 లక్షలను మంజూరు చేశారు. చికిత్స అందించినప్పటికీ అప్పటికే వ్యాధి తీవ్రత పెరగడంతో గతేడాది చివరలో వేదవల్లి మరణించింది. ఆమె చికిత్సకు గతంలో ఆ కుటుంబం పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. దీంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.7 లక్షలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మంజూరు చేసిన రూ.7 లక్షల చెక్కును సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు వేదవల్లి తండ్రి రఘుకు గురువారం సచివాలయంలో అందజేశారు.
అసలు పవన్ కొడుకు సింగపూర్ లోని కుక్కింగ్ స్కూల్ లో ఎందుకు చదువుతున్నాడు? వెనకున్న కథ ఇదే.!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రమాదంలో అతని చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. అంతేకాదు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పవన్ కొడుకుతో పాటు 14 మంది విద్యార్థులు గాయాల పాలయ్యారు అంట. ఈ ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటనను ముగించుకుని సింగపూర్ చేరుకున్నారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి కూడా భార్య సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లారు. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కోలుకుంటున్నాను అని సిగ్నల్ ఇచ్చిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. గాయాలు పూర్తిగా తగ్గే వరకు మరో రెండు మూడు రోజులు ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉంది అంట.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు అతని కుమారుడు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు ట్వీట్ చేసారు.
ఇది ఇలా ఉంటే…అసలు పవన్ కుమారుడు సింగపూర్ లో ఎందుకు ఉన్నారు అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా గతేడాది సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజ్నేవా కుమారుడిని కూడా సింగపూర్‌లో ఉంటున్నారు. మార్క్ శంకర్ పవనోవిచ్ రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్లో చదువుతున్నాడు. ఈ స్కూల్ లో 6 నుండి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు పలు రకాల ఇంటర్నేషనల్ డిషెస్ రెస్టారెంట్ స్టైల్ లో కుక్ చేయడం నేర్పిస్తారు.
అన్నా లెజ్నేవా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్శిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్‌లో డిగ్రీని పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్ అంటే ఆసియా దేశాల భాషలు గురించి, జీవన విధానం గురించి పరిశోధనలు చేయడం. ఈ పరిశోధనలో థాయిలాండ్ చరిత్ర గురించి తప్పకుండా స్టడీ చేస్తారు. అందుకే పవన్ భార్య సింగపూర్ లో ఉంటున్నారు. కుమారుడిని కూడా అక్కడే స్కూల్ లో జాయిన్ చేసారు. గతేడాది పవన్ కళ్యాణ్ తన భార్య యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ అందుకునే కార్యక్రమానికి హాజరయ్యారు.
భారతదేశంలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ నైన్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీకి మై హోం గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు, ప్రధాని మోదీ ప్రసంగించారు.
*దేశం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది – మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు*
మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక పురోగతి ప్రయత్నాల గురించి వివరించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ డేటా ప్రకారం రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు. పీఎం గతి శక్తి, స్టార్టప్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి వాటిలో మార్పునకు దారితీస్తుయని చెప్పారు. డిజిటల్ ఇండియాలో చూపిస్తున్న చొరవ అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఆదర్శంగా మారుతోందని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని కొనియాడారు. డిజిటల్ ఇండియా దార్శనికత దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక మార్గదర్శి పాత్రను పోషిస్తోందని, 1.45 బిలియన్ల భారతీయుల ఆకాంక్షలకు బలమైన దిశానిర్దేశం చేయడం, ప్రపంచ వృద్ధికి భారతదేశం ప్రధానంగా మారడం ద్వారా తాను ఎంతో ప్రేరణ పొందానని తెలిపారు.
*వాట్ ఇండియా థింక్స్ టుడే వినూత్న కార్యక్రమం – ప్రధాని మోదీ*
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రపంచం దృష్టంతా నేడు భారత్‌పై ఉందన్నారు. ప్రపంచంలోని ప్రతీ దేశ పౌరుడు ఒక జిజ్ఞాసతో భారత్ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రధాని తన ప్రసంగంలో సమకాలీన రాజకీయాలతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు. భారతదేశ ఆలోచనల గురించి యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని పేర్కొన్నారు. గతాన్ని, వర్తమానాన్ని పోల్చుతూ అనేక అంశాలను ప్రధాని ఉదహరించారు. వాట్ ఇండియా థింక్స్ టుడే ఒక వినూత్నమైన, అద్భుతమైన కార్యక్రమం అని, ఇతర చానళ్లకు కూడా ఎంతో ప్రేరణ ఇచ్చే విధంగా ఉందని మోదీ అభినందించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీవీనైన్ నెట్వర్క్ ను ప్రధాని మోదీ ప్రశంసించారు.
పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా అందరినీ ఆకట్టుకున్నారు జయ శంకర్. ఇక దర్శకుడిగా అరి అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీం బిజీగా ఉంది. ఇప్పటికే సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అరి మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ఈ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించారు.
భగవద్గీతలోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారు అని చూసిన ప్రతీ ఒక్క ఆడియెన్ చెబుతున్నారు. ఈ చిత్రంలో అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి భారీ తారాగణం నటించింది. అరిషడ్వర్గాల మీద తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షోని చూసిన వారంతా పొగిడేస్తున్నారు. ఇక అరి మూవీని ప్రస్తుతం వీక్షించేందుకు కొంత మందికి అవకాశాన్ని కల్పిస్తోంది చిత్రయూనిట్.
మైథలాజికల్ థ్రిల్లర్ జానర్లను ఇష్ట పడే ఆడియెన్స్‌కు ఈ చిత్రం మరింతగా నచ్చేలా ఉంటుంది. సినీ లవర్స్ అంతా కూడా ముందుగానే అరి మూవీని చూసే అవకాశాన్ని చిత్రయూనిట్ కల్పిస్తోంది. ఇలా విడుదలకు ముందే సినిమాను చూపించే ధైర్యాన్ని ఎవ్వరూ చేయరు. కానీ అరి మీదున్న నమ్మకం దర్శకుడు జయశంకర్ ఇలా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకునే వారు వివరాల్ని తెలియజేయండి అంటూ వాట్సప్ నంబర్‌ను కూడా డైరెక్టర్ జోడించారు.
విభిన్నం గా సినిమా తీయడమే కాదు.. అంత కంటే విభిన్నం గా సినిమాని ప్రమోట్ చేస్తేనే ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలరు. ఇప్పుడు అరి మూవీ టీం కూడా ఇలానే డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రిలీజ్‌కి ముందే సినిమాను చూపిస్తాం అని ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. పేపర్ బాయ్ తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్ అరి మూవీతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. జయ శంకర్ మూడో ప్రాజెక్ట్ కూడా కన్ఫామ్ అయింది. ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటిచంనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.
సినిమాబండితో మొదలుపెట్టి భిన్నమైన పాత్రలతో నటనలో ఆదర్శనంగా నిలుస్తున్న “రాగ్ మయూర్”
‘సివరపల్లి’ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతు మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తాజాగా రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాకి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ లో హీరోగా, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్ గా రెండు భిన్న పాత్రలతో ఒకేరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాగ్ మయూర్. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బాటలో భిన్నమైన స్క్రిప్స్ ఎంచుకుంటూ దూసుకు వెళ్తున్నాడు రాగ్ మయూర్. చదువులో స్టేట్ టాపర్ అయిన రాగ్ మయూర్ సినిమాల గురించి రివ్యూస్ రాసే స్థాయి నుంచి ఈరోజు తన నటనా ప్రతిభతో అదే రివ్యూలలో తన గురించి రాయించుకునే స్థాయికి ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
తొలిచిత్రం ‘సినిమా బండి’లో మరిడేష్ బాబు అనే పాత్రతో ఒక్కసారిగా మెరిశాడు రాగ్ మయూర్. ఆ పాత్రలో రాగ్ మయూర్ నటన, కామిక్ టైమింగ్, నేచురల్ గా అనిపించగా సినిమా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక ఆ తర్వాత రాగ్ మయూర్ భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెళుతున్నాడు.తర్వాత కీడా కోలా అనే సినిమాలో లాయర్ గా, బ్రహ్మానందం మనవడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వీరాంజనేయులు విహారయాత్రలో కూడా ఒక స్టార్టప్ మొదలు పెట్టాలని పరితపించే సగటు కుర్రాడిగా ఆకట్టుకున్నాడు.
అతని పాత్రల ఎంపిక చూస్తే ఏ ఒక్క దానికి మరో పాత్రకి సంబంధం ఉండదు. అలా భిన్నమైన పాత్రలు చేస్తూ రాగ్ మయూర్ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన సివరపల్లి సిరీస్ లో అసలు ఏమాత్రం ఉద్యోగం ఇష్టం లేకుండా చేసే పంచాయితీ సెక్రటరీ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. మరోపక్క గాంధీతాత చెట్టు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు దక్కించుకున్నాడు. భవిష్యత్తులో సినిమా బండి దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ‘పరదా’ సినిమాతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘గరివిడి లక్ష్మి’ అలాగే ఇంకా పేరు ఫిక్స్ చేయని గీతా ఆర్ట్స్ 2 సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నాడు.