మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.
తమిళ్ హీరోలు అయిన సూర్య, విక్రమ్, అజిత్, విజయ్, కార్తీ, విశాల్ వీళ్ళందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా సూర్యకి అయితే దాదాపు తెలుగు హీరోలతో సమానంగా క్రేజ్ ఉంది. సూర్య సినిమా విడుదల అయితే ఒక తెలుగు హీరో సినిమాకి ఎలాంటి సందడి ఉంటుందో సూర్య సినిమా విడుదలైన థియేటర్లలో కూడా అలాంటి సందడి ఉంటుంది.
అయితే సూర్య హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అని విక్రమ్ సినిమా చూసిన వారికి అర్థమయ్యే ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో చూస్తే సూర్య పాత్రని రోలెక్స్ అనే ఒక పాత్రగా పరిచయం చేస్తారు. సూర్య పాత్ర లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాలో విలన్ పాత్రలో నటించిన అర్జున్ దాస్ తో మాట్లాడుతూ ఉంటారు. ఖైదీ, విక్రమ్, తర్వాత రాబోయే సూర్య సినిమా మధ్యలో ఏదో ఒక కనెక్షన్ ఉంది అని ఇది చూస్తే అర్థమవుతుంది. అయితే అర్జున్ దాస్ పాత్ర ఖైదీ సినిమాలో కార్తీ పోషించిన ఢిల్లీ పాత్ర గురించి మాట్లాడుతాడు.
దీన్ని బట్టి చూస్తే కార్తీ హీరోగా, సూర్య నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతుంది. అయితే దాదాపు 8 సంవత్సరాల క్రితం సూర్య ఇదే విషయం గురించి చెప్పారు. ఇప్పుడు సూర్య ఎలా అయితే చెప్పారో అలాగే జరిగింది. కొద్ది సంవత్సరాల క్రితం సూర్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “తాను నెగిటివ్ పాత్రలో, కార్తీ హీరోగా విభూది పెట్టుకొని ఉన్న ఒక మంచి హీరో పాత్రలో నటిస్తే చూడాలని ఉంది అని, అలాంటి ఒక సినిమా చేయాలని ఉంది” అన్నారు. కార్తీ నటించిన ఖైదీ సినిమాలో కార్తీ పాత్ర అలాగే విభూది పెట్టుకుని ఉంటారు. దాంతో సూర్య ఎలా అయితే చెప్పారో అలాగే జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
watch video :