అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ‘ఇది కదా మహేశ్‌బాబు సినిమా అంటే’ అని అభిమానులు అనుకునేలా ఉంది.స్టార్స్ ఎప్పుడు..తమ అభిమానులతో టచ్ లో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు….అభిమానులు కూడా తమ స్టార్ తో మాట్లాడితే చాలు అని అనుకుంటూ ఉంటారు..ప్రతి ఒక్కరు పెర్సనల్ గ వెళ్లి కలవలేరు కదా..సోషల్ మీడియా అందరిని కలుపుకుంటూ పోతుంది..దూరాన్ని దగ్గర చేస్తుంది..సరిలేరు నీకెవ్వరూ..సినిమా బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీద ఉన్న మహేష్ గారు సరదాగా తన ఫేస్బుక్ పేజీ లో చాట్ సెషన్ పెట్టారు..వాటిలో కొన్ని ముఖ్యమైనవి మీకోసం !
News
ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులను హడలెత్తించే బామ్మ ..చివరికి ఏమైందో చూస్తే నవ్వుకుంటారు.!
ముంబైకి చెందిన ఓ బామ్మ ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులను ముప్ప తిప్పలు పెట్టింది. వెంకటలక్ష్మి తన పుట్టిన రోజును జరుపుకోవడానికి బ్రిస్బేన్‌లో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్తుంది. తన వెంట తీసుకెళ్లిన లగేజ్ బ్యాగ్ పై ఒక అక్షరం తేడాగా రాయడంతో ఎయిర్ పోర్ట్ అధికారులకు చుక్కలు కనపడ్డాయి… ఎయిర్‌పోర్టులో దిగంగానే బామ్మ లగేజ్‌పై ఉన్న విషయాన్ని చూసిన అధికారులు హడలి పోయారు. ప్రయాణికుల సామన్లలో ఒక బ్యాగు మీద ‘బాంబ్ టు బ్రిస్బేన్’ అని రాసి ఉంది. ఇది గమనించిన ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ బ్యాగ్‌ను తనిఖీ చేయవలసిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించాడు.ఇంతలో ఓ నడివయస్సు మహిళా ప్రయాణికురాలు ఆ బ్యాగ్ తనదేనంటూ పోలీసుల వద్దకు వచ్చింది.
పోలీసులు ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ముంబాయి నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఆ ప్రయాణికురాలి పేరు వెంకటలక్ష్మి(65). పోలీసులు ఆమెను బ్యాగు తెరిచి చూపించాల్సిందిగా ఆదేశించారు. బ్యాగులో ప్రమాదకరమైనవి ఏమి లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
మరి బ్యాగ్ మీద ఎందుకు ‘బాంబ్’ అని రాసి ఉంది అని అడగ్గా తాను ‘బాంబే’ అని రాయాలనుకున్నాను, కానీ స్థలం లేకపోవడంతో ‘వై’ ని రాయకుండా వదిలేసాను. దాంతో ‘బాంబే’ కాస్తా ‘బాంబ్’ గా మారిందని వివరించింది. బ్యాగును మరిచిపోతానేమో అని దానిపై ‘బాంబే టు బ్రిస్బేన్’ అని రాయాలనుకుంది. కానీ స్థలం సరిపోక ‘బాంబ్ టు బ్రిస్బేన్’ అని రాసింది. అక్షరం తేడా వల్ల ఇంత జరిగింది .
2 లక్షల దీపాలతో 90 అడుగులు పొడవు 60 అడుగుల రామ దర్బార్ ..10 వ ప్రపంచ రికార్డు
ప్రఖ్యాత ముంబైకి చెందిన ఆర్టిస్ట్ చేతన్ రౌత్ ముంబైలో ప్రపంచంలోనే అతిపెద్ద రామ్ దర్బార్‌ను సృష్టించారు. రామ్ దర్బార్ యొక్క చిత్రం 60 అడుగుల x 90 అడుగుల 2 లక్షల మట్టి దీపాలతో రూపొందించబడింది. ఈ సృష్టి చేతన్ యొక్క 10 వ ప్రపంచ రికార్డు .
రామ్ దర్బార్ యొక్క మొజాయిక్ పోర్ట్రెయిట్ ప్రపంచంలోనే అతి పెద్ద చిత్రం. మూడు రోజుల్లో 30 మంది పోర్ట్రెయిట్ పూర్తి చేయడానికి పగలు, రాత్రి పనిచేశారు. రౌత్ మాట్లాడుతూ, “ఇది నా 10 వ కొత్త ప్రపంచ రికార్డు. ఈ చిత్రం ద్వారా, మేము నూతన సంవత్సరాన్ని స్వాగతించాము. మేము 2 లక్షల మట్టి దీపాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రామ్ దర్బార్‌గా చేసాము.
ఈ నాలుగు సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసా .? ఈ సినిమానే సంక్రాంతి విన్నర్….!
సంక్రాంతి సినిమాల పోటీ ఎలా ఉంటుందనేది ప్రతిసారీ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు కానీ ఈసారి అసలు సిసలు ఫైట్ ఎలా ఉంటుందో మాత్రం తెలిసింది. ఈ సారి నాలుగు సినిమాలు వచ్చాయి ,సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల… వైకుంఠపురములో’. కళ్యాణ్ రామ్ నటించిన “ఎంత మంచివాడవురా” సినిమాలు సంక్రాంతి కానుకగా ఒకరోజు అటు ఇటుగా భారీ స్థాయిలో విడుదలయ్యాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే రెండు సినిమాలు పాజిటివ్ టాక్ అండ్ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ సత్తా చాటుతున్నాయి.
ముఖ్యంగా అందరికంటే రెండు రోజుల జనవరి 9న దర్బార్ అంటూ బరిలోకి దిగాడు మన సూపర్ స్టార్ రజినీకాంత్ , ఎవరికీ లేని అడ్వాంటేజ్ పండగ హీరోల్లో ఈయనకు ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబట్టినా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ థియేటర్స్ అయితే లేవు.
జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సాధారణంగా సంక్రాంతి సీజన్లో ఎటువంటి సినిమా వచ్చినా తప్పకుండా ఆడుతుంది. ప్రధాన పోటీ మాత్రం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మధ్యే ఉంది.
మీడియా లో యాడ్స్ లో ‘సంక్రాంతి విన్నర్’ అంటూ తమ సినిమాకు ట్యాగ్ తగిలించారు అల… వైకుంఠపురములో యూనిట్ . తమ సినిమా సంక్రాంతి విన్నర్ అని ఆ యూనిట్ ప్రకటించుకుంది.ఆ ట్యాగ్ కు కౌంటర్ గా మరో ట్యాగ్ ను వదిలింది సరిలేరు నీకెవ్వరూ యూనిట్. మొదటి రోజు తమ సినిమా సూపర్ హిట్ అని ప్రకటించుకున్న ఈ సినిమా రూపకర్తలు ఇప్పుడు తమ సినిమాకు ట్యాగ్ లైన్ మార్చారు. ‘అసలు సిసలైన సంక్రాంతి విజేత ‘ అట. ఈ సినిమాకు ఇప్పుడు ఈ ట్యాగ్ ను తగిలించారు.
అల యూనిట్ ఏమో తమ సినిమా సంక్రాంతి విన్నర్ అని ప్రకటించుకుంటుంటే, సరిలేరు యూనిట్ మాత్రం తమ సినిమా రియల్ సంక్రాంతి విన్నర్ అంటున్నారు. ఇప్పుడు ట్యాగ్ లు, కౌంటర్ ట్యాగ్ లతో ఇరు సినిమాల వాళ్లూ తమ పోటీని ధ్రువీకరించినట్టుగా అయ్యింది. అయితే వీటి గోలలో పడి మిగతా సినిమాలు ‘దర్భార్’ ‘ఎంతమంచివాడవురా సినిమాల పరిస్థితిని పట్టించుకోకపోవడం గమనార్హం.
ఒకటి మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటే మరోటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి విడుదల అయిన రెండు పెద్ద సినిమాలు కూడా విన్నర్ అయినట్లే..
ఇండియన్ ప్లేయర్ మనీష్ పాండే తన ఫీల్డింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు. అద్భుతమైన క్యాచ్‌తో రాజ్‌కోట్‌లో ఆసీస్ ఓపెనర్ వార్నర్‌కు షాక్ ఇచ్చాడు. షమీ వేసిన బౌలింగ్‌లో కవర్స్ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించిన వార్నర్.. మనీష్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరగాల్సి వచ్చింది. గాలిలో వేగంగా వెళ్తున్న బంతిని.. మనీష్ గాలిలోకి ఎగిరి ఒంటి చేతితో దాన్ని అందుకున్నాడు. ఫ్లాష్ వేగంగా మనీష్ ఆ క్యాచ్‌ను అందుకుని కేక పుట్టించాడు. వార్నర్ 12 బంతుల్లో రెండు ఫోర్లతో 15 రన్స్ చేశాడు. 341 రన్స్ చేజ్ చేస్తున్న ఆస్ట్రేలియా.. 16 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 86 రన్స్ చేసింది.
Well-done Manish Pandey #INDvAUS pic.twitter.com/9oRbnJ7zEC
— Cricket Network (@CricketNetwork7) January 17, 2020
It took an ABSOLUTE STUNNER from #ManishPandey to get their 1st wicket of the series! #BattleOfEquals #INDvAUS pic.twitter.com/e4TzFvpu1r
— Hotstar UK (@hotstarUK) January 17, 2020
టొరెంట్ లింక్ ఉంటె పంపించు అంటూ కామెంట్ చేసిన నెటిజన్ కి “Netflix” చెంప చెళ్లుమనిపించేలా ఎలా రిప్లై ఇచ్చిందో తెలుసా !
కొందరికి…నోటి దురుసు మాములూగా ఉండదు..ఎక్కడ ఎలా మాట్లాడాలో కొంచెం కూడా అర్థం అవ్వదు..ఎందుకో మరి..సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో వాడుతున్న మనం మనం పెట్టె కామెంట్స్,షేర్ చేస్తున్న ఫొటోస్ అందరూ చూస్తూ ఉన్నారు అన్న..అవగాహన లేకుండా పోయింది ,ఎలా పడితే ఆలా మాట్లాడితే నవ్వుల పాటూ అయ్యేది మనమే..అన్న సంగతి మరచిపోయి మాట్లాడుతూ ఉంటారు..
ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇటీవలే తన వెబ్ సైట్ లో ఒక హర్రర్ వెబ్ సిరీస్ ని విడుదల చేస్తూ క్యాప్షన్ ఏమని పెట్టారు అంటే..Sacred Games మధ్య రాత్రి 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ నిద్ర ని బలి దానం చెయ్యాలి.అంటూ పెట్టసాగారు..ఈ పోస్ట్ లో అత్యుత సాహం చూపించిన నెటిజెన్ మాకు టొరెంట్ ఉందిలే అంటూ కామెంట్ పెట్టగ దానికి రిప్లై ఇస్తూ…నువ్ టొరెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండు మేము 12 గంటలకి చూసుకుంటాము అంటూ రిప్లై ఇచ్చింది నెట్ ఫ్లిక్..ఈ కామెంట్ కు అందరూ లైక్ కొడుతూ మద్దతు పలికారు కూడా..ఎంతయినా ఆలా పెట్టడం తప్పు కదూ అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు .
అల వైకుంఠపురములో రిలీజ్ విషయం లో తప్పుడు నిర్ణయం అంటున్నా ఫ్యాన్స్ ..కారణం ఇదే
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరవాత హీరో అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ నుంచి వస్తున్న చిత్రం అల వైకుంఠపురములో… భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో అలనాటి తార టబు రీఎంట్రీ ఇవ్వడం, తమన్ అందించిన పాటలకి మంచి క్రేజ్ రావడం, టీజర్, ట్రైలర్స్ లలో త్రివిక్రమ్ మార్క్ కనిపించడం సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి,

బన్ని ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ యాక్టింగ్ , డాన్స్ ఇరగాదీశాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని, ఇక ఇంటర్వెల్ బ్లాక్ సూపర్బ్ అనిపించేలా ఉందంటున్నారు.ఇక త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పంచులు బాగా పేలాయని అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాలో బన్ని తర్వాత మురళీశర్మ పాత్ర బాగుందని, తండ్రి పాత్రలో ఇరగాదీశాడని అంటున్నారు. సినిమాలో హీరోయిన్స్ ఇద్దరు గ్లామర్ షోకి మాత్రమే పరిమితం అయ్యారని అంటున్నారు.

తమన్ అందించిన పాటలు స్క్రీన్ పైన బాగున్నాయని అంటున్నారు. నేపధ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయిందని అంటున్నారు. పి యస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని అంటున్నారు. సముద్రఖని, సుశాంత్, వెన్నల కిశోర్, నవదీప్, రాహుల్ రామకృష్ణ లాంటి నటులను ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోలేదన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి టాక్ అయితే సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది.

సినిమా రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసింది.కానీ ఈ సినిమాను రిలీజ్ చేసే విషయంలో మాత్రం త్రివిక్రమ్ లెక్క తప్పిందని అంటున్నారు కొంతమంది నిపుణులు.సంక్రాంతి బరిలో ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమా, రజినీకాంత్ గారు నటించిన దర్బార్ లు సినిమా లు రిలీజ్ అయ్యి శని,ఆదివారాల కలెక్షన్లు కొల్లగొట్టింది.అయితే అల వైకుంఠపురము సినిమాను గురువారం లేక శుక్రవారం కాకుండా ఏకంగా ఆదివారం రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల రికార్డును మిస్ చేసుకుంది.రెండు రోజుల తేడాతో ఇంత హడావిడిగా పండుగ సీజన్లోనే రిలీజ్ ఎందుకు చేశారనేది చిత్ర వర్గాల ప్రశ్న.కాస్త సమయం ఇచ్చి రిలీజ్ చేసి ఉంటే అదిరిపోయే కలెక్షన్లు వచ్చేవి అని సినీ ప్రముఖులు తో పాటు బన్నీ ఫ్యాన్స్ చెపుతున్నారు..
సరిలేరు నీకెవ్వరూ.సైరా సినిమాలలో నటించిన ఈ పెద్దాయన పేరు ఏంటో తెలుసా ?…ఈయన గురించి కొన్ని నిజాలు
‘ రమణ లోడ్ ఎత్తాలి రా..చెక్ పోస్ట్ పడుద్ధి .. అంటూ డైలాగ్స్ చెప్పి పవర్ఫుల్ ఫైట్ లో మెరిసిన ఈ పెద్దాయన పేరు..’Kumanan Sethuraman
ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా ఉండే వారు చెన్నై నుంచి వైజాగ్ కి 1984 వ సంవత్సరం లో వచ్చారు.ఆయనకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమట.. సినిమా లకి చేయాలని ఆయన అనుకునేవారు అట ..సినీ ఇండస్ట్రీ కి వెళ్లి మెంబెర్ షిప్ కార్డు తీసుకున్నారుట! ఒక సినిమా షూట్ జరుగుతుండగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకు ఇచ్చియాన్ డైలగ్ ని సరిగ్గా చెప్పా లేకపోయారు అట అతను..
ఇది చూసి నవ్వినా Kumanan గారిని డైరెక్టర్ పిలిచి చెప్పామన్నారు అట ఫట్ మని చెప్పేయడం తో..ఇంకా ప్రతి సీన్ కి కుమనెన్ గారినే తీసుకున్నారు అట..అక్కడ నుంచి ఇక తిరిగి చూడవలసిన అవసరం రాలేదు..చాల సినిమా లలో విలన్ గా చేసారు..అరవింద్ 2 లో కూడా కనిపించాయారు.v v వినాయక్ గారి అల్లు స్సేను లో ప్రదీప్ రావత్ ప్రక్కనే నటించారు కూడా మళ్లీ అదృష్టం సురేందర్ రెడ్డి గారి సైరా సినిమా రూపం లో దక్కింది ‘బోయ హెడ్’ గా నటించారు.ఇప్పుడు సరి లేరు నీకెవ్వరూ లో కుడా చేసారు..ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు
కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ రివ్యూ & రేటింగ్ : నందమూరి ఫాన్స్ కి పండుగ రోజు !
రజనీకాంత్ దర్బార్ తో సంక్రాంతి వేటను మొదలు పెట్టిన తలైవా..తరువాత సరిలేరు …తో మహేష్ బంపర్ హిట్ కొట్టి..ఆలా వైకుంఠపురములో అంటూ త్రివిక్రమ్ తో వచ్చిన అల్లు మరో బ్లాక్ బస్టర్ కొట్టి తెలుగు ఇండస్ట్రీ కి చక్కటి ఆరంభం ఇచ్చిన హీరోలు ఇప్పుడు కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ అంటూ వచ్చారు…
ఇప్పటికే ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తో మంచి ఊపు మీద ఉన్న టీం సంక్రాంతి కానుకగా జనవరి 15న (ఈ రోజు) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్బంగా గత రాత్రి ఓవర్సీస్లో ప్రీమియర్స్ పడ్డాయి. ఆ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయలు తెలిపారు. ఆ వివరాలు చూద్దామా….కింద ఉన్న వీడియో రివ్యూ చూడండి.
ఈ సంక్రాంతికి టాలీవుడ్లో రెండు బడా చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అయితే.. మరొకటి బన్నీ ‘అల.. వైకుంఠపురములో’. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాయి . ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ డే కలెక్షన్స్ : ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 65 కోట్లు రాబట్టినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో సాలిడ్ కలెక్షన్లు రాబట్టి మహేష్ పట్టుబిగించినట్లు తెలుస్తోంది. న ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో దుమ్ముదులిపేసింది ఈ మూవీ.

అల.. వైకుంఠపురములో ఫస్ట్ డే కలెక్షన్స్ : ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 52 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు మార్కెట్ అనలిస్ట్‌లు లెక్కలు కట్టారు. అధికారిక లెక్కలు రావాల్సి ఉండగా.. షేర్ రూ. 36 కోట్లు రాబట్టిందని అంచనా.రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తొలి రోజు ఏపీ, తెలంగాణలలో దాదాపు రూ. 25 కోట్లు, ఓవర్సీస్లో 7 కోట్లుపైగానే వసూలు చేసినట్టు తెలుస్తోంది.
