ఎవరూ ఊహించని విధంగా ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మధ్యలో ఆపేశారు. అందుకు కారణం కోవిడ్ కేసులు పెరగడమే. ప్లేయర్లందరూ కూడా ఐపీఎల్ మొదలయ్యే ముందు నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నారు. బయో బబుల్ ని చాలా సురక్షితం అని భావించారు.
కానీ ఆ బయో బబుల్ కూడా బద్దలయింది. “అంత సేఫ్ అని భావించిన బయో బబుల్ లో పాజిటివ్ కేసులు రావడం ఏంటి?” అనే విషయంపై అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఐపీఎల్ ప్రారంభం అయ్యే ముందే ప్రమాదం ఉండే అవకాశం ఉంది అనే విషయం తెలిసినా కూడా బీసీసీఐ ఈ విషయాన్ని ఇగ్నోర్ చేసింది. బీసీసీఐ చేసిన పొరపాట్లు ఏంటంటే.
# ముందుగా ఐపీఎల్ ని యూఏఈలో నిర్వహించాలని అనుకున్నారు. దానికి బీసీసీఐ కూడా సానుకూలంగా స్పందించింది. కానీ తర్వాత భారతదేశంలో నిర్వహించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చింది.
#దేశంలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆరు వేదికల్లో ఐపీఎల్ నిర్వహించాలి అని అనుకోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
# ఐపీఎల్ 2020 లో యూఏఈ లో నిర్వహించిన లీగ్ లో లండన్ కి చెందిన రెస్ట్రా కంపెనీ సేవలను బీసీసీఐ ఉపయోగించుకుంది. ఈసారి మాత్రం నిర్లిప్తత ప్రదర్శించింది.
# హోటల్ బుకింగ్ విషయంలో కూడా పొరపాటు జరిగింది. ఒక టీం ముంబై స్టేడియం కి పది కిలోమీటర్ల దూరంలో హోటల్ బుక్ చేసుకుంది. అది కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో. అందరికీ దూరంగా ఉండాల్సిన ఈ సమయంలో జనం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో హోటల్ ఉండడం వల్ల రిస్క్ ఎక్కువ అయ్యింది.