అయోధ్య రామ మందిరానికి విరాళాలు అందించిన సెలబ్రిటీలు వీరే….!

అయోధ్య రామ మందిరానికి విరాళాలు అందించిన సెలబ్రిటీలు వీరే….!

by Harika

Ads

జనవరి 22 తారీఖున అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దేశ నలుమూలల నుండి 7000 మందిపైగా ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు.ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు అయోధ్య రామ మందిరానికి విరాళాలు అందించారు.

Video Advertisement

విదే విరాళాలు అందించిన సెలబ్రిటీల లిస్టును ఒకసారి పరిశీలిస్తే ఇందులో ముందుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. 2021 లోని అయోధ్య రామ మందిరం కోసం పవన్ కళ్యాణ్ 30 లక్షల రూపాయల విరాళాన్ని ఆలయ నిర్మాణ కమిటీకి అందించారు. అలాగే తనతో పాటు పనిచేసే నిర్మాతలతో కూడా ఆలయానికి విరాళాలు ఇప్పించారు. మొత్తంగా జనసేనాని తరఫునుండి అయోధ్య ఆలయానికి 80 లక్షల రూపాయలు విరాళం అందింది. ఇక హీరోయిన్ ప్రణీత కూడా అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళాలని అందించింది.
ఇక తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి కూడా ఈ ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు అందించాడు.

పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విరాళాలు అందించిన వారిలో ఉన్నారు. అక్షయ్ కుమార్, హేమమాలిని, అనుపమ్ ఖేర్, ముఖేష్ కన్నా,గుర్మీత్ చౌదరి, క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా విరాళాలు అందించిన వారిలో ఉన్నారు.


End of Article

You may also like