2021 లో పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారైన 10 మంది సినీ సెలెబ్రిటీలు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!

2021 లో పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారైన 10 మంది సినీ సెలెబ్రిటీలు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!

by Megha Varna

Ads

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా మంది ప్రముఖుల వివాహాలు జరిగాయి. వారిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా చాలా మంది ఉన్నారు. కొంత మంది ముందే అనౌన్స్ చేసి వివాహం చేసుకుంటే, ఇంకొంత మంది మాత్రం వివాహం జరిగిన తర్వాత ఫోటోలని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

Video Advertisement

2021 మొత్తం చూసుకున్నట్లయితే ఈ సెలబ్రెటీలు ఒక ఇంటి వాళ్ళు అయ్యారు. మరి ఆ సెలబ్రెటీల గురించి ఇప్పుడు చూద్దాం.

#1. దియా మీర్జా:

బాలీవుడ్ అందాల తార దియా మీర్జా వ్యాపారవేత్త వైభవ్ రేఖీ తో ఏడు అడుగులు వేశారు. వీళ్ళ వివాహం ఫిబ్రవరి 15న అయింది.

#2. గుత్తా జ్వాల:

 

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా ఈ ఏడాదే వివాహం చేసుకున్నారు. ఈమె తమిళ నటుడు విష్ణు విశాల్ ని వివాహం చేసుకున్నారు. హైదరాబాదులో ఏప్రిల్ 22న వీళ్ళ వివాహమయింది.

#3. కార్తికేయ:

టాలీవుడ్ యాక్టర్ కార్తికేయ తన ప్రియురాలు లోహిత ని వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో నవంబర్ 21న వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది.

#4. కత్రినా కైఫ్:

కత్రినా కైఫ్ కూడా 2021 లో వివాహం చేసుకున్నారు. కత్రినా కైఫ్ కి విక్కీ కౌశల్ తో ఈ ఏడాది డిసెంబర్ 9న పెళ్లి అయ్యింది.

#5. సునీత:

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేని వివాహం చేసుకున్నారు.

#6. ఆనంది:

తెలుగు అమ్మాయి ఆనంది కోలీవుడ్ కి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ ని వివాహం చేసుకున్నారు.

#7. రాజ్ కుమార్:

11 సంవత్సరాల రిలేషన్షిప్ తరువాత రాజ్ కుమార్ తన ప్రియురాలు పాత్ర లేఖని నవంబర్ 15న వివాహం చేసుకున్నారు.

#8. వరుణ్ ధావన్:

వరుణ్ ధావన్ కూడా ఈ సంవత్సరం ఒక ఇంటివారు అయ్యారు. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా ని జనవరి 14న వివాహం చేసుకున్నారు.

#9. యామి గౌతమ్:

బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఆదిత్య ధర్ ని ఈ సంవత్సరం జనవరి 14న పెళ్లి చేసుకున్నారు.

#10. ప్రణీత సుభాష్:

ఈ ఏడాదే బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణీత సుభాష్ వివాహం అయ్యింది.


End of Article

You may also like