పవన్ కళ్యాణ్ కి పోటీగా నిలబడుతున్న ఈ సెలబ్రిటీ ట్రాన్స్‌జెండ‌ర్ ఎవరో తెలుసా..?

పవన్ కళ్యాణ్ కి పోటీగా నిలబడుతున్న ఈ సెలబ్రిటీ ట్రాన్స్‌జెండ‌ర్ ఎవరో తెలుసా..?

by Harika

Ads

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరికి వస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద ప్రముఖ సెలబ్రిటీ ట్రాన్స్‌జెండ‌ర్ తమన్నా సింహాద్రి పోటీ చేయబోతున్నారు. తమన్నా సింహాద్రి బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయ్యారు. గతంలో మంగళగిరి నియోజకవర్గం నుండి లోకేష్ కి పోటీగా తమన్నా సింహాద్రి పోటీ చేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయబోతున్నారు. భారత చైతన్య యువజన పార్టీ నుండి తమన్నా సింహాద్రి పోటీ చేస్తున్నారు.

Video Advertisement

 celebrity who is contesting opposite pawan kalyan

ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అయిన బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకి ఇన్చార్జ్ గా ఆకుల జయ కళ్యాణి వ్యవహరిస్తారు. అయితే ఈ విషయం మీద రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చేయని సాహసాన్ని వారు చేసినట్టు తెలిపారు. ప్రజా సేవ చేయాలి అనే ఆలోచన ఉన్న ట్రాన్స్‌జెండ‌ర్ వారికి కూడా చట్టసభల్లో అవకాశాలు ఇవ్వాలి అని తమన్నా సింహాద్రికి సీట్ ఇచ్చినట్టు తెలిపారు. తమన్నా సింహాద్రికి రాజకీయాల మీద మక్కువ ఉంది. గతంలో బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో తమన్నా సింహాద్రి ఫేమస్ అయ్యారు.

celebrity who is contesting opposite pawan kalyan

కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఎలిమినేట్ అయ్యారు. తర్వాత కొన్ని ఇంటర్వ్యూలలో, బిగ్ బాస్ ఈవెంట్స్ లో, యూట్యూబ్ ఛానల్ లో వ్లాగ్ వీడియోల ద్వారా కూడా అలరించారు. గతంలో మంగళగిరి నుండి తమన్నా సింహాద్రి పోటీ చేస్తున్న సమయంలో, ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన నాయకులలో తక్కువగా ఉంది అని, దాంతో ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతోనే మంగళగిరి నుండి పోటీ చేస్తున్నట్టు తమన్నా సింహాద్రి తెలిపారు. గతంలో తమన్నా సింహాద్రి జనసేన నుండి టికెట్ ఆశించారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే తమన్నా సింహాద్రి పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు.

ALSO READ : ‘అరవింద సమేత’ స్టోరీ ని మంచు విష్ణు సినిమా లో అప్పుడే చెప్పారుగా..!!


End of Article

You may also like