JANASENA PARTY : జనసేన పార్టీలోకి కొత్తగా చేరిన “చైతన్య” ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

JANASENA PARTY : జనసేన పార్టీలోకి కొత్తగా చేరిన “చైతన్య” ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Mohana Priya

Ads

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. జనసేన పార్టీ కూడా ప్రచారంలో జోరు పెంచింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రచార పనుల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

Video Advertisement

ఇందులో భాగంగానే జనసేన పార్టీలోకి చేరడానికి ఆసక్తి చూపిస్తున్న నాయకులని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇదే విధంగా తాజాగా జనసేనలోకి చైతన్య చేరారు. చైతన్య ప్రముఖ వ్యాపారవేత్త, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయిన డీకే ఆదికేశవులు నాయుడు గారి మనవరాలు.

chaitanya janasena party

చైతన్య మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ చైతన్యకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దాంతో చైతన్య పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా చైతన్యకి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. డీకే ఆదికేశవులు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు చెందినవారు. ఆయన కూతురు తేజస్వి. తేజస్వి కూతురు చైతన్య. చైతన్య ఇప్పటికే ఒక ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ కూడా చేస్తున్నారు.

chaitanya janasena party

జనసేన పార్టీ విధానాలు చైతన్యకి నచ్చడంతో ఈ పార్టీలో చేరదాం అనే నిర్ణయం తీసుకున్నారు. “తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ చైతన్య ఇప్పటికే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఇలాంటి ఒక వ్యక్తి జనసేన పార్టీలో చేరడం అనేది చాలా మంచి పరిణామం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంపీగా ఆదికేశవులు నాయుడు చిత్తూరుని ఎంతో అభివృద్ధి చేశారు.

chaitanya janasena party

ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా కూడా తిరుమల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. చైతన్య చేసిన మంచి పనులను, చైతన్య తాత గారు అయిన డీకే ఆదికేశవులు నాయుడు గారు చేసిన మంచి పనులను పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుని అభినందించారు. అలాంటి ఒక గొప్ప నాయకుడి వారసత్వాన్ని కొనసాగిస్తూ, సమాజాభివృద్ధి కోసం చైతన్య కూడా తన వంతు కృషి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ALSO READ : AP POLITICS: కాంగ్రెస్ లో చేరనున్న షర్మిల…. విజయమ్మ దారి ఎటు…? ఆంధ్ర రాజకీయంలో ఏం జరగబోతుంది.?


End of Article

You may also like