“హార్ట్ బ్రేక్ చేసే విషయం విన్నప్పుడు వచ్చేది నిశ్శబ్దం..!” అంటూ… “చైతన్య జొన్నలగడ్డ” పోస్ట్..! ఏం రాశారంటే..?

“హార్ట్ బ్రేక్ చేసే విషయం విన్నప్పుడు వచ్చేది నిశ్శబ్దం..!” అంటూ… “చైతన్య జొన్నలగడ్డ” పోస్ట్..! ఏం రాశారంటే..?

by Harika

Ads

మెగా కుటుంబం నుండి వచ్చిన నటి నిహారిక కొణిదల. నిహారిక సినిమాల్లో నటించడంతో పాటు, కొన్ని సిరీస్ ప్రొడ్యూస్ కూడా చేశారు. వ్యాపార రంగంలో కూడా ఉన్నారు. నిహారిక మధ్యలో నటన నుండి బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత నుండి మళ్ళీ ఇప్పుడు నటించడం మొదలు పెట్టారు. అయితే నిహారికకి కొంత కాలం క్రితం చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి జరిగింది.

Video Advertisement

కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ విడిపోయారు. పెళ్లయిన ఏడాదికే వీళ్ళు విడిపోయినట్టు నిహారిక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిసింది. కానీ ఇటీవల వాళ్ళిద్దరూ విడిపోయినట్టు ప్రకటించారు. అధికారికంగా వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి చైతన్య జొన్నలగడ్డ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఫోటో షేర్ చేస్తున్నారు.

అంతకుముందు చైతన్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. కానీ కొంత కాలం నుండి మాత్రం ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే మాత్రమే సోషల్ మీడియాలో ఫోటోలని షేర్ చేస్తున్నారు. లేదా ఆ విషయాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల చైతన్య జొన్నలగడ్డ తాను రాసిన ఒక కవితని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిశ్శబ్దం గురించి ఈ కవిత ఉంది. “నిశ్శబ్దం అంటే విశాలమైన స్థలంలాంటిది. నీళ్లలో ఉన్నప్పుడు మనకి కలిగేది నిశ్శబ్దం.”

chaitanya jonnalagadda post about silence

“చల్లటి శీతాకాలపు రాత్రిలో కలిగేది నిశ్శబ్దం. ఏదైనా ఒక షో అయిపోయాక, చప్పట్లు వినిపించేముందు మధ్యలో ఉండే సమయం నిశ్శబ్దం. ఏదైనా ఒక గుండె పగిలే విషయాన్ని విన్నప్పుడు వచ్చేది నిశ్శబ్దం. నిన్ను భావోద్వేగానికి గురి చేసే ఆలోచనలు నీకు వచ్చినప్పుడు ఉండేది నిశ్శబ్దం. నిన్ను జీవితానికి, ప్రకృతికి మధ్య వేరు చేసేది నిశ్శబ్దం. శరీరం నుండి నువ్వు స్వేచ్చని పొందాక దేవుడు అనే మాధ్యమంలో నువ్వు కనుగొనేది ఈ నిశ్శబ్దం” అని రాశారు. ఈ కవితని స్వయంగా చైతన్య రాశారు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో చైతన్య కవి కూడా అనే విషయాన్ని నెటిజన్లకి తెలిపారు.

ALSO READ : వైరల్ అవుతున్న “స్మితా సబర్వాల్” 12 క్లాస్ మార్క్స్ మెమో…హైదరాబాద్‌లోనే ఎక్కడ చదివారో తెలుసా.?


End of Article

You may also like