Home Filmy Adda Chaitanya, Samantha: విడాకులు తీసుకున్నాక మొదటిసారి ఒకే చోటా వున్నా కంట పడలేదు..!!

Chaitanya, Samantha: విడాకులు తీసుకున్నాక మొదటిసారి ఒకే చోటా వున్నా కంట పడలేదు..!!

by Megha Varna

ఒకప్పుడు టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అయిన సమంత, నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇటు అభిమానులు, అటు సినీ తారలు సైతం విడాకులు తీసుకుంటారని అస్సలు ఊహించలేదు.

అయితే ఇద్దరు కూడా సినీ ఇండస్ట్రీలో పని చేస్తారు కనుక ఈరోజు కాకపోతే రేపైనా ఎదురు పడాల్సి వస్తుంది. ఒకవేళ కనుక వీళ్ళు ఎదురు పడితే చూసుకుంటారా, మాట్లాడుకుంటారా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అక్కినేని నాగ చైతన్య బంగార్రాజు ఆఖరి షెడ్యూల్ మరియు సమంత శాకుంతల ఆఖరి షెడ్యూల్ రెండూ కూడా రామా నాయుడు స్టూడియో లో ఒకే రోజు వచ్చాయి.

వీళ్ళు ఇద్దరు ఒకరి కంట ఒకరు పడకుండా ఉండాలని సిబ్బందికి ముందే తెలిపారు. దీంతో ఒకరి కంట ఒకరు పడకుండా షూటింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చేసారని తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ శాకుంతల, యశోద, కాతువాకుల రెండు కాదల్‌, అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ తో బిజీగా ఉంది. మరొక పక్క నాగ చైతన్య బంగార్రాజు, థాంక్యూ సినిమాలు చేస్తున్నాడు.

You may also like