Ads
అల్లు అర్జున్ ‘పుష్ఫ’ మూవీలో ‘ఊ అంటావా’ సాంగ్ ను పాడి సింగర్ మంగ్లీ చెల్లెలు ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం మరో గాయని కూడా ఓవర్ నైట్ లో పాపులారీటీని తెచ్చుకుంది. ఆ గాయని పేరు ధీ. ఇటీవల హీరో నాని హీరోగా రాబోతున్న దసరా చిత్రం నుండి వచ్చిన ‘చమ్కీల అంగీలేసి’ అనే సాంగ్ తో ధీ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ కు మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి.
Video Advertisement
మొదట్లో ఈ సాంగ్ విన్నవారు సింగర్ ధీ తెలుగు అమ్మాయని అనుకున్నారు. అయితే ఆమె తమిళ అమ్మాయి. ఇక ఆమె పూర్తి పేరు ధీక్షిత, ఇంట్లో అందరు ఆమెను ప్రేమగా ధీ అని పిలుస్తారంట. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ పేరు కూడా ధీ ఆని ఉంటుంది. ఆమె తండ్రి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ నారాయణ్. కాగా ధీ తమిళ నాడులో జన్మించినప్పటికి ఆస్ట్రేలియాలో చదువుకుంది.
ఆమెకు చిన్నతనం నుండే సంగీతం అంటే చాలా ఇష్టం ఉండటంతో సంగీతం నేర్చుకుని 14 సంవత్సరాల వయసులోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ధీ దసరా మూవీ కన్నా ముందు చాలా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. విక్టరీ వెంకటేష్ నటించిన ‘గురు’ చిత్రంలోని ‘ఓ సక్కనోడా’ పాట కూడా ఆమె పాడింది.
ధనుష్ నటించిన ‘మారి 2’ మూవీలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ను కూడా సింగర్ ధీనే పాడింది. ఈ రెండు సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయని చెప్పవచ్చు. ప్రస్తుతం దసరా మూవీలోని చమ్మీల అంగీలేసి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుండడంతో ధీ ఎవరు? ఆమె నేపధ్యం ఏమిటి అని ఆన్లైన్ లో నెటిజెన్స్ వెతుకున్నారు. ప్రస్తుతం ఆమె క్రేజ్ టాలీవుడ్ లో పెరగటంతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.
Also Read:రోజా పూలు మూవీ హీరో గుర్తున్నాడా? ఆ హీరో భార్య సెలెబ్రెటీ అని తెలుసా?
End of Article