వాల్తేరు వీరయ్య పాటపై వివాదం.. చంద్రబోస్ యండమూరి ప్రశ్న కి ఎలా రియాక్ట్ అయ్యారంటే..?

వాల్తేరు వీరయ్య పాటపై వివాదం.. చంద్రబోస్ యండమూరి ప్రశ్న కి ఎలా రియాక్ట్ అయ్యారంటే..?

by Megha Varna

Ads

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా వున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకి రానున్నారు. మాస్ లుక్ తో ఇప్పటికీ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేసారు. ఈ సినిమా వస్తే మెగా ఫ్యాన్స్ కి పండగని చెప్పచ్చు. ఈ సినిమా టైటిల్ మరియు టీజర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

Video Advertisement

ఈ మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్స్ లో వున్నాయి. ఈ సినిమాలో చిరు పక్కన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చెయ్యడానికి రెడీ అయ్యిపోయారు. ఇదిలా ఉంటే యండమూరి వీరేంద్రనాథ్ చంద్ర బోస్ మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఇంతకీ అసలు ఏమైంది అనేది చూస్తే.. ”తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడే వీడే.. తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే” అని చంద్ర బోస్ పాటని వ్రాసారు. దాన్ని ప్రశ్నిస్తూ యండమూరి ఇలా అడిగారు.

రాసిన వాడికి పురాణకథలు తెలుసా..? ఏం చదివాడు..? తిమిరము అంటే అర్ధం తెలుసా..? ఇది శివదూషణ కాదా..? అన్నారు. అలానే తెలుగు సిని కవిత్వం వేటూరి మరణంతో మసకబారి దీపం అయ్యిపోతే సిరివెన్నెల మరణం తో దీపం ఆరిపోయింది అని పోస్ట్ చేసారు. దీనికి చంద్ర బోస్ తనకి ఎందుకు ఇలా వ్రాసాననేది తెలుసని వివరించారు. శివదూషణ చేయలేదని.. తాను హీరో పాత్ర కోసం చెప్పినట్టు వివరించారు. పైగా చిరంజీవి గారూ, సత్యానంద్ గారూ పాట చూసి అధ్యయనం చేయాల్సిన పాట అని మెచ్చుకున్నారని అన్నారు. పైగా 30 ఏళ్ళ కి ముందే పాటలు రాయక ముందు తిమిరహరనం అనే పదప్రయోగం చేసానని చెప్పారు చంద్ర బోస్.


End of Article

You may also like