Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చలో ఉన్న అంశం రామమందిర నిర్మాణం గురించే. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇవాళ భూమి పూజ జరిగింది. ప్రధానమంత్రి మోడీ చేతుల మీదగా ఈ పూజ కార్యక్రమాన్ని జరిపించారు. అలాగే శ్రీరామ్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు రామమందిర నమూనా నిర్మాణాన్ని ట్విట్టర్ లో ఆవిష్కరించారు.
Video Advertisement
రామ మందిర నమూనా ని రూపొందించిన వ్యక్తి చంద్రకాంత్ సోమ్ పుర. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన చంద్రకాంత్ సోమ్ పుర గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1940లో చంద్రకాంత్ తాతగారు సోమ్‌నాథ్ ఆలయ నమూనాను రూపొందించారు. అంతేకాకుండా అక్షర్‌థామ్ ఆకృతులను కూడా చంద్రకాంత్ కుటుంబం రూపొందించారు. దాంతో మోడ్రన్ ఆర్కిటెక్చర్ చదువుకోకపోయినా కానీ చంద్రకాంత్ కు భారతీయ నిర్మాణ శైలి పై ఎంతో అవగాహన ఉంది. నిర్మాణ విద్యను తన తాత గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను అని చెప్తారు చంద్రకాంత్.
30 ఏళ్ల కిందటే రామమందిర నిర్మాణం నమూనా రూపొందించడానికి చంద్రకాంత్ ని సంప్రదించారట. అలా 1990లో మొదటిసారి రామమందిర నమూనా నిర్మాణాన్ని రూపొందించారట.
ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందు రూపొందించిన డిజైన్లో ఎన్నో మార్పులు చేయాల్సి వచ్చిందట. ముందు రెండు గోపురాలతో డిజైన్ చేసిన ఆలయ నమూనా ఇప్పుడు 5 గోపురాలతో, శిఖరంతో రూపొందించారు.
బనస్ కాంతలోని అంబాజీ ఆలయం, లండన్ లోని స్వామి నారాయణ ఆలయం తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకుపైగా ఆలయ నమూనా లని రూపొందించారు చంద్రకాంత్. శిల్ప శాస్త్రం పై 12 పుస్తకాలను రచించారు.
ప్రస్తుతం భారత దేశంలో నిర్మించబోతున్న ఎనిమిది ఆలయాల డిజైన్లు రూపొందిస్తున్నారు చంద్రకాంత్. ఆయన ఇన్నేళ్ల కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం చంద్రకాంత్ ని పద్మశ్రీతో సత్కరించింది.
తన తాతగారు గుజరాత్ లోని సోమ్ నాథ్ డిజైన్ రూపొందించారని, తాను ఇప్పుడు రామ మందిర నిర్మాణానికి నమూనా డిజైన్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పారు. రాజస్తాన్ లోని బన్సీ పహర్ పూర్ నుండి తెప్పించిన పింక్ శాండ్ స్టోన్ తో రామ మందిరాన్ని నిర్మించబోతున్నారు.
మందిర నిర్మాణం లో ఎటువంటి లోహం వాడరు. ఆలయ నిర్మాణ పనులను చంద్రకాంత్ కుమారులైన నిఖిల్, ఆశిష్, అశుతోష్ పర్యవేక్షిస్తున్నారు. ఆలయ నిర్మాణం అయిన తర్వాత ఫలితాన్ని ఆస్వాదించడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చంద్రకాంత్ అన్నారు.
End of Article